Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భూమా మౌనికపై వైసిపి సంచలన ఆరోపణలు, ఫోన్ నెంబర్లు ఇచ్చారు

నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి సోదరి భూమా నాగ మౌనిక పోలింగ్ ఏజెంట్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వైసిపి సంచలన ఆరోపణలు చేసింద

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి సోదరి భూమా నాగ మౌనిక పోలింగ్ ఏజెంట్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వైసిపి సంచలన ఆరోపణలు చేసింది.

పోలింగ్ బూత్‌లోనే ప్రచారం అంటూ

పోలింగ్ బూత్‌లోనే ప్రచారం అంటూ

భూమా మౌనిక ఏకంగా పోలింగ్ బూత్‌లోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోందని వైసిపి నేతలు ఆరోపించారు. టిడిపికి ఓటు వేయాలని మౌనిక ఆదేశాలు ఇచ్చారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

    Nandyal By Election Polling Begins, High Security in Nandyal | oneindia telugu
    ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు

    ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు

    పోలింగ్ బూత్‌లలోకి వెళ్లి టిడిపికి ఓటు వేయమని చెప్పడం ఏమిటని వైసిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బూత్ నెంబర్ 55, 56, 57లో ఓటర్లను మౌనిక ప్రచారం చేశారని, దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వైసిపి ఆరోపించింది.

    గంపులుగా వెళ్లి

    గంపులుగా వెళ్లి

    ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా నందమూరి నగర్‌లో వందమందికి పైగా స్థానికేతరులు గుంపుగా ఏర్పడి ప్రలోభాలకు తెరతీశారని వైసిపి ఆరోపిస్తోంది. వైయస్సార్ నగర్‌లోని ఓ బూత్ వద్ద క్యూ లైన్లో నిలబడ్డ ఓటర్లను స్థానికేతరులు ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు.

    ఫోన్ నెంబర్లు ఇచ్చిన వైసిపి

    ఫోన్ నెంబర్లు ఇచ్చిన వైసిపి

    ఉప ఎన్నికలో ఎలాంటి అక్రమాలు జరిగినా, ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరిగినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని వైసిపి ఓటర్లను కోరింది. 7981230095, 7981429455 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, తాము వెంటనే ఈ విషయాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని చెప్పింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+