నంద్యాల మాదే, కాకినాడా మాదే: టీడీపీ నేత కళా వెంకట్రావు
నంద్యాలలో బుధవారం జరిగిన ఉపఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. టీడీపీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నంద్యాలా మాదే, కాకినాడా మాదే..’ అన్నారు.
కర్నూలు: నంద్యాలలో బుధవారం జరిగిన ఉపఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'జగన్ భాష నచ్చని ప్రజలు టీడీపీకే ఓటు వేశారు. టీడీపీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నంద్యాలా మాదే, కాకినాడా మాదే..' అన్నారు.
కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ తరపున మంత్రులు, సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.

వైసీపీ నేతలు కూడా అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమ విజయం తథ్యమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల నియోజకవర్గం ఘన నివాళి అర్పించబోతోంది : భూమా మౌనిక
నంద్యాల ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేశారని, తన తండ్రి భూమా నాగిరెడ్డి ఆత్మ శాంతించాలని ప్రతి ఒక్కరూ కష్టపడ్డారని మంత్రి అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక అన్నారు.
ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 'మా నాన్నగారికి నంద్యాల నియోజకవర్గం ఘన నివాళి అర్పించబోతోంది. ఆయన ఆత్మ శాంతించబోతోంది. దీని కోసమే, మేమందరం వేచి చూస్తున్నాం. అలాగే, రాబోయే కాలంలో బ్రహ్మానందరెడ్డి అన్న కూడా ఎంతో మంచి పనులు చేస్తూ, నాన్న పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను..' అని అన్నారు.
-
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !!












Click it and Unblock the Notifications