వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలుపు ఓటములపై 'గోస్పాడు', భూమా ఫ్యామిలీకి కలిసి వచ్చేనా?, వైసీపీ ధీమా ఇదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల:నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని గోస్పాడు మండలం అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేయనుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈ మండలంలో వివిద పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లపై లెక్కలు తీస్తున్నారు. ఈ లెక్కల ఆధారంగా టిడిపి, వైసీపీలు ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం వ్యూహరచన చేస్తున్నారు.

''పాపానికి ఓటు వేయాలని దేవుడు చెప్పడు, అంతిమ విజయం హీరోదే, బాబుకు ఉరిశిక్షైనా తక్కువే''''పాపానికి ఓటు వేయాలని దేవుడు చెప్పడు, అంతిమ విజయం హీరోదే, బాబుకు ఉరిశిక్షైనా తక్కువే''

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలు 2019 ఎన్నికలకు సెమీఫైనల్స్ వంటివని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థానంలో విజయం కోసం రెండు పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి.

నంద్యాల: 2009లో 'పిఆర్‌పి' అభ్యర్థికి 35 వేల ఓట్లు, 'పవన్' మద్దతు కీలకంనంద్యాల: 2009లో 'పిఆర్‌పి' అభ్యర్థికి 35 వేల ఓట్లు, 'పవన్' మద్దతు కీలకం

ఈ నెల 23వ, తేదిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను 8 మంది మంత్రులను నంద్యాలలో మకాం వేశారు. వైసీపీ చీఫ్ జగన్ రెండురోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.

జగన్ ఎఫెక్ట్: అఖిలప్రియ ధర్నా,ఈసీకి టిడిపి ఫిర్యాదు, పీకే వ్యూహంతోనే...జగన్ ఎఫెక్ట్: అఖిలప్రియ ధర్నా,ఈసీకి టిడిపి ఫిర్యాదు, పీకే వ్యూహంతోనే...

ఈ ఎన్నికను పురస్కరించుకొని అధికార టిడిపి, విపక్ష వైసీపీల మధ్య మాటలయుద్దం సాగుతోంది. విపక్ష నేత జగన్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో కీలక ప్రాంతాలపై కేంద్రీకరించాయి.

గోస్పాడు మండలమే కీలకం

గోస్పాడు మండలమే కీలకం

నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్‌లో గోస్పాడు మండలం కీలకంగా మారనుంది. నంద్యాలలో పోటీచేసే అభ్యర్థుల గెలుపు ఓటములను ఈ మండలం ప్రభావితం చేయనుంది. దీంతో ఈ మండలంపైనే టిడిపి, వైసీపీలు కేంద్రీకరించాయి.2014 లో జరిగిన ఎన్నికల సమయంలో గోస్పాడు మండలం నుండి వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డికి టిడిపి అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి కంటే 750 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ మండలంలో మెజారిటీని సాధిస్తే గెలుపు సునాయాసంగా ఉంటుందని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. అందుకే రెండు పార్టీలు కూడ ఈ మండలంపైనే కేంద్రీకరించి పనిచేస్తున్నాయి.

Recommended Video

Chandrababu Gave Promise to Bhuma Akhila Priya Over Nandyal MP
భూమా కుటుంబానికి కలిసి వచ్చేనా?

భూమా కుటుంబానికి కలిసి వచ్చేనా?

గోస్పాడు మండలం గతంలో ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఉంది. అంతేకాదు ఈ మండలంతో భూమా కటుంబానికి సన్నిహిత సంబంధాలు, బంధుత్వాలున్నాయి. దీంతో భూమా నాగిరెడ్డి సోదరుడి కొడుకు భూమా బ్రహ్మనందరెడ్డి టిడిపి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో ఈ మండలంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, కర్నూల్ ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్‌రెడ్డి ఇన్‌చార్జీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వైసీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంచార్జీగా ఉన్నారు. ఈ మండలంలో బ్రహ్మనందరెడ్డి సోదరి నాగమౌనిక రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఎవరి లెక్కలు వారివే

ఎవరి లెక్కలు వారివే

గోస్పాడు మండలంలో అత్యధిక ఓట్లను సాధిస్తే ప్రయోజనం ఉంటుందని రెండు పార్టీలు భావిస్తున్నాయి. అయితే రెండు పార్టీలు తమదైన లెక్కలను వేసుకొంటున్నాయి. ఇటీవల నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో గోస్పాడు మండలంలో చంద్రబాబు పర్యటించారు. దీంతో వైసీపీ చీఫ్ జగన్ కూడ గోస్పాడు మండలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డికి ఈ మండలం నుండి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే భూమా నాగిరెడ్డి పార్టీ మారిన తర్వాత పార్టీ క్యాడర్ వైసీపీతోనే ఉందని వైసీపీ నేతలు సంతోషంతో ఉన్నారు. అంతేకాదు ఆ ఎన్నికల సమయంలో టిడిపిలో ఉన్న పీసీ నాగిరెడ్డి టిడిపిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన శిల్పా మోహన్‌రెడ్డితో పాటే వైసీపీలో చేరారు. దీంతో దీబగుంట్లలో వైసీపీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు. గత ఎన్నికల్లో దీబగుంట్లలో టిడిపికి మెజారిటీ వచ్చింది.

అభివృద్ది మంత్రం ఫలించేనా?

అభివృద్ది మంత్రం ఫలించేనా?


ఈ ఎన్నికల్లో టిడిపి అభివృద్ది మంత్రాన్ని జపిస్తోంది. నంద్యాల పట్టణంలో ప్రధానంగా అభివృద్ది , సంక్షేమ కార్యక్రమాలపై కేంద్రీకరించి పనిచేస్తోంది. గత ఎన్నికల సమయంలో భూమా నాగిరెడ్డి ఇచ్చిన ఇళ్ళ నిర్మాణం, రోడ్ల విస్తరణకు సంబంధించిన అంశాలను నెరవేర్చేందుకు టిడిపి పనిచేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి ఈ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసింది. అయితే త్వరలోనే ఈ పనులు పూర్తి కానున్నాయని ప్రజలను నమ్మకం కల్గించేందుకు యత్నించింది. అయితే వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి మాత్రం ఈ పనులన్నీ ఎన్నికల స్టంట్‌గా కొట్టిపారేస్తున్నారు.

English summary
Nandyal By-Poll is drawing everyone's attention as this is the first election after TDP Government completed 3 years rule.The Nandyal by-poll has gained prominence as it comes at a crucial moment, after three years of the TDP government in the state.Nandyal has also been a stronghold of the YSRCP, and a win for the TDP here will make a big political statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X