నంద్యాల కుతకుత: 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత: ఈ జిల్లాల్లో

Temperature in AP: ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోంది.

Nandyal witnessed 47 7 degrees celsius temperature

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. జాయింట్‌గా జనంపై దాడి చేస్తోన్నాయి.

శుక్రవారం నంద్యాల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గోస్పాడు, బండి ఆత్మకూరుల్లో 47.7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. ఇది మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

ప్రకాశం జిల్లా అర్ధవీడు- 47.3, కడప జిల్లా చిన్నచెప్పలి- 47.2, నెల్లూరు జిల్లా వేపినాపి, అక్కమాంబపురం- 47.1 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 15 జిల్లాలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 38 మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయ్యాయి. నెల్లూరు- 37, కడప- 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. తిరుపతి- 34, శ్రీసత్యసాయి- 32, చిత్తూరు- 31, అనంతపురం- 31, అన్నమయ్య రాయచోటి- 30, నంద్యాల- 29, ఏలూరు- 28 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి.

పల్నాడు- 28, విజయనగరం- 27, బాపట్ల- 25, కృష్ణా- 25, కర్నూలు- 25, అనకాపల్లి- 24, అల్లూరి సీతారామరాజు- 22, కోనసీమ- 22, కాకినాడ- 21 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు రోణంకి కూర్మనాథ్ వివరించారు. వడదెబ్బ తగలకుండా ప్రజలు ముందు జాగ్రత్తచర్యలు తీసుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+