టాయ్‌లెట్‌బోర్డ్ పరిస్థితి రాకుండా చూస్కో:హరీష్‌కి టిడిపి
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంకు భవిష్యత్తులో టులెట్ బోర్డు పెట్టక తప్పదని, 2090లో కూడా టిడిపి తెలంగాణలో అధికారంలోకి రాదని వ్యాఖ్యానించిన తెరాస నేత హరీష్ రావు పైన టిడిపి నేత నన్నూరి నర్సిరెడ్డి సోమవారం మండిపడ్డారు. ఇచ్చిన హామీల అమలులో తెరాస విఫలమైతే ఆ పార్టీ కార్యాలయానికి ప్రజలే టాయ్‌లెట్ బోర్డు పెడతారని, ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని హరిష్ రావుకు నన్నూరి హితవు పలికారు.
తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే ఆలోచనలు మానుకోవాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలను తమను లక్ష్యంగా పెట్టుకోవడం మానుకోని పాలన పైన దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు ఎన్నికల్లో తెరాసను గెలిపించింది.. ఆ పార్టీ ప్రణాళిక, ఇచ్చిన హామీలను విశ్వసించే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు తెరాస వల?
తెలంగాణ రాష్ట్రంలోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మూడు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోగా ఆ మూడూ ఖమ్మం జిల్లాలోనివే కావటంతో విజేతలకు రాష్ట వ్య్రాప్తంగా గుర్తింపు లభించింది. సమైక్యాంధ్రకు మద్దతు పలకటంతో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయటమే కష్టంగా మారిన జగన్ పార్టీ నుంచి గెలుపొందిన నేతలను తమవైపు తిప్పుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పక్కా వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో తెరాస కేవలం కొత్తగూడెం స్థానంలోనే విజయం సాధించటంతో రానున్న కాలంలో జిల్లాలో పార్టీ విస్తరణే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఖమ్మం జిల్లాలోనే తెరాస బలహీనంగా ఉందని, జగన్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన వారిని తమవైపు తిప్పుకుంటే కొంత లాభం పొందవచ్చని తెరాస ఆశిస్తోంది. ఈ మేరకు వరంగల్ జిల్లాకు చెందిన తెరాస నేతలు రంగంలోకి దిగారని సమాచారం.












Click it and Unblock the Notifications