నారావారి పల్లికి నారా - నందమూరి కుటుంబాలు : వీరసింహారెడ్డి సందడి..!!

సంక్రాంతి సంబరాలకు నారా - నందమూరి కుటుంబాలు సిద్దం అవుతున్నాయి. మూడేళ్ల విరామం తరువాత నారావారి పల్లిలో ఈ రెండు కుటుంబాలు సందడి చేయనున్నాయి. నందమూరి బాలయ్య నటించిన వీర సింహారెడ్డి ఈ నెల12వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా పైన బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల అయిన మరుసటి రోజున చంద్రబాబు తో కలిసి బాలయ్య - లోకేశ్ నారావారి పల్లికి వెళ్లనున్నారు. ముందుగానే అక్కడకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. బాలయ్య సతీమణి వసుంధర, బ్రాహ్మణి, దేవాన్ష్ నారా వారి పల్లికి చేరుకుంటారు.

12న వీరసింహా రెడ్డి విడుదల కానుండటంతో ఆ తరువాత బాలయ్య తన బావ చంద్రబాబుతో కలిసి నారావారి పల్లికి చేరుకుంటారు. ప్రతీ ఏటా నారావారి పల్లిలో నారా - నందమూరి కుటుంబాలు కలిసి సంక్రాంతి చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. అయితే, గడిచిన మూడేళ్ల కాలంలో కరోనా కారణంగా సంక్రాంతి వేడులకు సొంత గ్రామానికి రాలేదు.

Nara and Nandamuri Families to celebrate Sankranthi at Naraivari Palle

తిరిగి ఇప్పుడు రెండు కుటుంబాలు కలిసి వస్తుండటంతో సందడి వాతావరణం కనిపిస్తోంది. గత ఏడాది బాలయ్య తన కుటుంబంతో కలిసి ప్రకాశం జిల్లాలో సోదరి పురంధేశ్వరి ఇంట్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు తిరిగి నారావారి పల్లకి వస్తున్నారు. అటు రాజకీయంగా..ఇటు సమరసింహా రెడ్డి సందడితో ఈ సారి నారావారి పల్లిలో సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు.

Nara and Nandamuri Families to celebrate Sankranthi at Naraivari Palle

పండుగ పూర్తయిన తరువాత 16వ తేదీన చంద్రబాబు, బాలయ్య, లోకేశ్ హైదరాబాద్ కు తిరుగు పయణమవుతారు. భువనేశ్వరి తో పాటుగా మిగిలిని వారు తిరిగి హైదరాబాద్ వెళ్లే విధంగా షెడ్యూల్ ఖరారు అయింది. ఈ సారి సంక్రాంతికి వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు అగ్ర హీరోల సినిమాలు ఒకే సమయంలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు అభిమానుల నుంచి భారీ స్పందన కనిపించింది. ఇక, సినిమా విడుదల నుంచి మూడు రోజుల పాటు బాలయ్య అక్కడే ఉంటుండటంతో వీరసింహా రెడ్డి ప్రత్యేక సందడి ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+