ఆనందంగా ఉంది: హరికృష్ణను ప్రస్తావించిన నారా బ్రాహ్మణి

Posted By:
Subscribe to Oneindia Telugu

హిందూపురం: తన తాత ఎన్టీఆర్, పెదనాన్న హరికృష్ణ, తండ్రి బాలకృష్ణలు ప్రాతినిథ్యం వహించిన హిందూపురం రావడం ఆనందంగా ఉందని హెరిటేచ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి సోమవారం అన్నారు.

అనంతపురం జిల్లా లేపాక్షిలోని హెరిటేజ్‌ సంస్థ రజతోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 2022 నాటికి రూ.6వేల కోట్ల టర్నోవరే తమ లక్ష్యమన్నారు.

షాకింగ్: కంటతడి పెట్టారు.. మోడీతో జగన్ భేటీ వెనుక రహస్యం ఇదీ!!

Nara Brahmini visits Hindupuram

హెరిటేజ్‌ సంస్థ రైతుల సంక్షేమం కోసం రైతు నిధి ఏర్పాటు చేసిందన్నారు. ఎవరైనా రైతులు ప్రమాదవశాత్తు మృతి చెందితే సంక్షేమ నిధి నుంచి రూ.2లక్షలు అందిస్తామన్నారు.

కాగా, బ్రాహ్మణి రైతులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. భర్తను కోల్పోయిన మహిళా రైతుకు రూ.2 లక్షల పరిహారం అందించారు. సంస్థ లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తున్నారని సిబ్బందికి కితాబిచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister and TDP leader Nara Lokesh's wife Nara Brahmini visited Hindupuram on Monday.
Please Wait while comments are loading...