మూడోసారి బాబు: కేబినెట్‌లో వీరే.. డిటైల్స్, బిజెపికి 2

విజయవాడ/గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 19 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరికి బిజెపి నుండి అవకాశం దక్కింది. ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గవర్నర్ మంత్రులుగా 19 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు. సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు రెండుసార్లు సిఎంగా పని చేసిన చంద్రబాబు కొత్త ఎపికి తొలి సిఎం అయ్యారు. ఆయన సిఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.

యనమల రామకృష్ణుడు (ఎమ్మెల్సీ) - తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నాయకులు. యాదవ సామాజిక వర్గం నేత. ఇంగ్లీషులో ప్రమాణం చేశారు. 1983 నుండి ఆరుసార్లు తుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999-2004 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు.

Nara Chandrababu cabinet ministers list

చినరాజప్ప (పెద్దాపురం) - తూర్పు గోదావరి జిల్లా సీనియర్ నేత. తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. 1992 నుండి టిడిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. పెద్దాపురం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

అయ్యన్నపాత్రుడు (నర్సీపట్నం) - విశాఖ జిల్లా టిడిపి సీనియర్ నేత. తెలుగులో ప్రమాణం చేశారు. మూడుసార్లు మంత్రిగా పని చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. టిడిపితో ముప్పై ఏళ్ల అనుబంధం. వెలమ సామాజిక వర్గం నేత.

బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి (శ్రీకాళహస్తి) - చిత్తూరు జిల్లా సీనియర్ నేత. తెలుగులో ప్రమాణం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.

దేవినేని ఉమామహేశ్వర రావు (మైలవరం) - దేవినేని కృష్ణా జిల్లా సీనియర్ నేత. మైలవరం నుండి గెలుపొందారు. కమ్మ సామాజిక వర్గం నేత. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో అన్నయ్య మృతితో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1999, 2004లో నందిగామ నుండి, 2009, 2014లో మైలవరం నుండి గెలుపొందారు. మంత్రిగా పని చేశారు.

పి. నారాయణ - తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన నాయకుడు. నారాయణ విద్యాసంస్థల అధినేత. కాపు సామాజిక వర్గం నేత. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండానే మంత్రి పదవి వచ్చింది. త్వరలో ఆయనను మండలికి పంపించనున్నారు.

పరిటాల సునీత (రాప్తాడు) - అనంతపురం జిల్లా సీనియర్ నేత. కమ్మ సామాజిక వర్గం నేత. పరిటాల రవి హత్య అనంతరం ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 2005 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2009, 2014లలో రాప్తాడు నుండి గెలుపొందారు.

పత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట) - తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కమ్మ సామాజిక వర్గం నేత. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు.

కామినేని శ్రీనివాస రావు (కైకలూరు, బిజెపి) - టిడిపితో పాతికేళ్ల అనుబంధముంది. 2009లో పిఆర్పీ నుండి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2014లో బిజెపిలో చేరి గెలిపొందారు. కృష్ణా జిల్లా నేత. ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేశారు.

గంటా శ్రీనివాస రావు (భీమిలి) - గంటా శ్రీనివాస రావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. 1999లో అనకాపల్లి నుండి ఎంపీగా గెలుపొందారు. మాజీ మంత్రి. కాపు సమాజిక వర్గానికి చెందిన నేత. టిడిపి నుండి పిఆర్పీ, అటు నుండి కాంగ్రెసులోకి వెళ్లారు. టిడిపిలోకి తిరిగి వచ్చారు.

పల్లె రఘునాథ రెడ్డి (పుట్టపర్తి) - అనంతపురం జిల్లా సీనియర్ నేత. తెలుగులో ప్రమాణం చేశారు. 2007-2009 మధ్య ఎమ్మెల్సీ. 1997లో నల్లమాడ, 2004, 2014లలో పుట్టపర్తి నుండి గెలుపొందారు. ఉన్నత విద్యావంతుడు. ఎమ్మెస్సీ, ఎంఫిల్, రెండు పిహెచ్‌డి పట్టాలు పొందారు. రెడ్డి సామాజిక వర్గం నేత.

పీతల సుజాత (చింతలపూడి) - ఎస్సీ సామాజిక వర్గం నేత. పశ్చిమ గోదావరి జిల్లా నాయకురాలు. టీచర్ గా పని చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. సుజాత తండ్రి వరప్రసాద్ టిడిపి నేత.

అచ్చెన్నాయుడు (టెక్కలి) - మూడుసార్లు హరిశ్చంద్రాపురం నుండి గెలుపొందారు. 1996లో రాజకీయ్ల్లోకి వచ్చారు. కొప్పుల వెలమ సామాజిక వర్గం నేత. దివంగత ఎర్రన్నాయుడు సోదరుడు. తెలుగులో ప్రమాణం చేశారు.

శిధ్దా రాఘవ రావు (దర్శి) - వైశ్య నేత. వృత్తిరీత్యా గ్రానైట్ వ్యాపారి. ప్రకాశం జిల్లా నేత. 2004లో బాలినేని శ్రీనివాస రావు చేతిలో ఒంగోలులో ఓడిపోయారు. తెలుగులో ప్రమాణం చేశారు.

మృణాళిని (చీపురుపల్లి) - తూర్పుసామాజిక వర్గం నేత. బొత్స సత్యనారాయణను ఓఢించారు. టిడిపి సీనియర్ నేత కళా వెంకట్రావు దగ్గరి బంధువు. గతంలో శ్రీకాకుళం జెడ్పీ చైర్ పర్సన్ గా పని చేశారు. తెలుగులో ప్రమాణం చేశారు.

కొల్లు రవీంద్ర (మచిలీపట్నం) - తెలుగులో ప్రమాణం చేశారు. మత్స్యకార సామాజిక వర్గం నేత. కోస్తా రహదారు, బందరు ఎయిర్ పోర్టు ఉద్యమాల్లో తనదైన పాత్ర పోషించారు. తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారు.

రావెల కిషోర్ (ప్రత్తిపాడు) - గుంటూరు జిల్లా నేత. తెలుగులో ప్రమాణం చేశారు. బాలయోగి పిఏగా పదేళ్ల పాటు పని చేశారు. ఉన్నత విద్యావంతుడు. దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఎస్సీ సామాజిక వర్గం నేత. తొలిసారి ప్రత్తిపాడు నుండి గెలిచారు.

మాణిక్యాల రావు (తాడేపల్లిగూడెం) - తెలుగులో ప్రమాణం చేశారు. 1998 నుండి 2004 వరకు బిజెపి జిల్లా అధ్యక్షుడు. పశ్చిమ గోదావరి జిల్లా కాపు వర్గం నేత. పగో నుండి ఎన్నికైన ఏకైక బిజెపి ఎమ్మెల్యే. ఫోటో గ్రాఫర్ నుండి మంత్రి వరకు ఎదిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+