లోకేష్, సాయిరెడ్డి పోటా పోటీ..! ఆసక్తికర చర్చ..!

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న మంత్రి ఒకరు. రాజకీయాలకు తాజాగా గుడ్ బై చెప్పేసిన మాజీ ఎంపీ మరొకరు. వీరిద్దరూ ఇవాళ దాదాపు ఒకే పని చేశారు. ఇంకా చెప్పాలంటే ఆ పని కోసం పోటీ పడ్డారు. జాతీయ స్దాయిలో బీజేపీలో కీలకంగా ఉన్న ఓ నేత కుమారుడి కోసం వీరిద్దరూ పోటీ పడ్డారు. అయితే నేరుగా కాదు ఎవరికి వారుగానే. అయినా వీరిద్దరి ఉత్సాహంపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది.

కేంద్ర హోంమంత్రి, బీజేపీ కీలక నేత, ప్రధాని మోడీ తర్వాత ఆ పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేత అమిత్ షా. ఆయన కుమారుడు, క్రికెట్లో ఏ అర్హత లేకపోయినా అత్యున్నత స్ధాయి పదవి అయిన ఐసీసీ ఛైర్మన్ గా పనిచేస్తున్న వ్యక్తి జై షా. అలాంటి వ్యక్తిని ప్రసన్నం చేసుకునేందుకు ఇవాళ మంత్రి నారా లోకేష్ తో పాటు విజయసాయిరెడ్డి కూడా పోటా పోటీగా ట్వీట్లు పెట్టారు. జై షా పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తారు.

nara Lokesh and vijayasai reddy convey birthday wishes to icc chairman jay shah

ముందుగా ఉదయం మంత్రి నారా లోకేష్ .. జై షాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. గతంలో జైషాతో దిగిన ఓ ఫొటోను కూడా దీనికి జత చేశారు. "ఐసీసీ ఛైర్మన్ మరియు నా సోదరుడు జై షాకు పుట్టినరోజు శుభాకాంక్షలు! మీ దృఢమైన నాయకత్వాన్ని మరియు మహిళలకు వేతన సమానత్వం, WPL ప్రారంభం, బలమైన వేతనం మరియు పెన్షన్లు మరియు ఆట వృద్ధికి ఆజ్యం పోసిన రికార్డు స్థాయి మీడియా హక్కులతో సహా చేపట్టిన ప్రధాన సంస్కరణలను నేను ఎంతో ఆరాధిస్తాను. క్రికెట్ మరియు భారతదేశానికి మీరు ఇంకా చాలా సంవత్సరాలు సేవ చేయాలని కోరుకుంటున్నాను. మీ దృక్పథం ప్రతి ఫార్మాట్‌ను, ప్రతి ఆటగాడిని మరియు ప్రతి అభిమానిని ఉన్నతీకరించడం కొనసాగించాలని కోరుకుంటున్నాను." అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

nara Lokesh and vijayasai reddy convey birthday wishes to icc chairman jay shah

ఆ తర్వాత వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి జైషాకు పుట్టినరోజు శుభాకాంక్షలతో ట్వీట్ చేశారు. "ఐసీసీ చైర్మన్ జై షాకు
హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో, క్రికెట్ పరివర్తన దశలోకి ప్రవేశించింది, ఒలింపిక్స్‌లో క్రీడను చేర్చడం నుండి ప్రపంచవ్యాప్తంగా మహిళా క్రికెట్‌ను అద్భుతంగా ప్రోత్సహించడం వరకు కీలకమైన మార్పులకు దారితీసింది." అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇలా ఏపీకి చెందిన ఇద్దరు నేతలు పోటాపోటీగా జైషాకు పుట్టినరోజు శుభాకాంక్షలతో ట్వీట్లు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+