జగన్‌, కెసిఆర్‌లతో ఢీ: నారా లోకేష్ రోడ్డు షోలు

Nara Lokesh to begin Road shows
హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్రల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కునేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఈసారి ఎన్నికల్లో కూడా తెర వెనక సేవలే అందిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన తెలంగాణ, సీమాంధ్రల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నెల 12వ తేదీ నుంచి ఆయన తన రోడ్డు షోలను ప్రారంభిస్తారని అంటున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఆయన తన పర్యటనను ప్రారంభిస్తారని చెబుతున్నారు. సీమాంధ్రలోనే కాకుండా ఆయన తెలంగాణలో కూడా పర్యటించే అవకాశాలున్నాయి.

నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేదా అనేది ఇంకా తెలియడం లేదు. ఆయన పోటీకి దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు తన అభ్యర్థులను ప్రకటించలేదు. బిజెపితో సీట్ల కేటాయింపు వ్యవహారం తేలకపోవడంతో అభ్యర్థుల జాబితా వెల్లడిలో జాప్యం జరుగుతోంది.

నారా లోకేష్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే, చంద్రగిరి నుంచి గల్లా అరుణ కుమారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఆమె ఇటీవలే తన కుమారుడు గల్లా జయదేవ్‌తో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+