ఇదిగో... తనే.. నా రియల్ లైఫ్ హీరో.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
ఎప్పుడూ పొలిటికల్ ట్వీట్స్ కనిపించే టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్‌లో ఇవాళ ఆయన కుమారుడి ఫోటోతో ట్వీట్ కనిపించింది. శనివారం(మార్చి 21) తనయుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు కావడంతో లోకేష్ తన ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. 'నాతో పిల్లో ఫైట్ చేసే నా బెస్ట్ ఫ్రెండ్‌కి హ్యాపీ బర్త్ డే. నా అడ్వెంచరస్ ప్రయాణాల్లో భాగస్వామి.. ప్రతీ ఒక్కరి పట్ల దయతో వ్యవహరించే నా రియల్ లైఫ్ హీరో.. జీవితం కంటే నేను ఎక్కువగా ప్రేమించే నా కొడుకు దేవాన్ష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
లవ్యూ దేవాన్ష్' అని లోకేష్ ట్వీట్ చేశారు.ఈ బర్త్ డేతో నారా దేవాన్ష్ ఆరో ఏటకి అడుగుపెట్టాడు. నారా లోకేష్-బ్రాహ్మణిల కుమారుడైన దేవాన్ష్ 2015 మార్చి 21న జన్మించాడు. దేవాన్ష్ పట్ల ఆయన తాత,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఎంత ప్రేమనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు... కనీసం తన మనువడితో గడిపేందుకు కూడా సమయం కేటాయించకుండా అమరావతి నిర్మాణం కోసం కృషి చేస్తున్నానని చంద్రబాబు పలుమార్లు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇటు నారా లోకేష్ కూడా నిత్యం పాలిటిక్స్‌తో బిజీగా ఉన్నా.. కొడుకుతో గడిపేందుకు మాత్రం తప్పకుండా సమయం కేటాయిస్తారు. దేవాన్ష్ స్కూల్ వ్యవహారలన్నీ అతని తల్లి బ్రాహ్మణియే చూసుకుంటుంది. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా పలువురు నెటిజెన్స్ కూడా ట్విట్టర్‌లో విష్ చేశారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications