వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ ఆకాంక్షలు నెరవేరాలి: చిరంజీవికి నారా లోకేష్ ట్వీట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మెగాస్టార్, కేంద్రమాజీ మంత్రి చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు (బుధవారం 22 - 08 -2018) చిరంజీవి పుట్టిన రోజు. ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మంత్రి నారా లోకేష్ కూడా ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. అంటూ ట్వీట్ చేశారు. మీరు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని, రానున్న రోజుల్లో విజయవంతం కావాలని దేవుడిని కోరుకుంటున్నానని, అలాగే మీ కలలు, ఆకాంక్షలు నిజం కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

Nara Lokesh birthday wishes to Chiranjeevi

కాగా, చిరంజీవి సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య పుట్టిన రోజు సందర్భంగా సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. భార్య లెజెనోవా, పిల్లలతో కలిసి చిరు ఇంటికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ రాకతో చిరంజీవి ఇల్లు సందడిగా మారింది. అన్నదమ్ములు ఒకేచోట చేరడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.

చిరంజీవికి ఎందరో ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నయనతార, పవన్ కళ్యాణ్, డాక్టర్ రాజశేఖర్, వరుణ్ తేజ్, నితిన్, కాజల్ అగర్వాల్ తదితరులు ఎందరో శుభాకాంక్షలు తెలిపారు.

English summary
'Happy birthday Chiranjeevi Garu. May you be blessed with health and success in the coming year and may all your wishes come true' Nara Lokesh tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X