జగన్‌కు నారా లోకేష్ సవాల్
జగన్‌కు నారా లోకేష్ సవాల్
అమరావతి: వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమని..ప్లేస్, టైమ్ జగన్ డిసైడ్ చేసుకోవాలని లోకేష్ సవాల్ విసిరారు. యడ్లపాడు మండలం తిమ్మాపురంలో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ఉంటూ విమర్శలు చేయడం మాని.. ఏపీకి వచ్చి అభివృద్ధిని చూడాలన్నారు. సాక్షికి, జగన్ కు అభివృద్ధి కనబడటం లేదన్నారు. జగన్కు రాష్ట్రం గురించి కనీస అవగాహన లేదని విమర్శించారు. ఏపీకి సమర్థుడైన ముఖ్యమంత్రి ఉన్నారు కానీ సరైన ప్రతిపక్షనేత లేరన్నారు.












Click it and Unblock the Notifications