దమ్ముంటే బయటకు రా: కెసిఆర్‌కు లోకేష్ సవాల్
హైదరాబాద్: తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారనే విషయంపై చర్చకు పిలిచినా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు బయటకు రాలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ అన్నారు. దమ్మూ, ధైర్యం ఉంటే బయటకు రావాలని ఆయన కెసిఆర్‌కు సవాల్ విసిరారు.
గురువారం జరిగిన తెలంగాణ ప్రాంత విద్యార్థుల మేధోమథన సదస్సులో ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు. 'బాబ్లీ ప్రాజెక్టు గురించి మాట్లాడరు. బయ్యారం గనుల గురించి మాట్లాడరు. సోడా బాటిల్లో సోడా అయిపోతే మాత్రం పోరాడతారు' అని కెసిఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చెప్పాలని తెరాస నేతలను, కార్యకర్తలను ప్రతీ తెలుగుదేశం విద్యార్థి నిలదీయాలని లోకేష్ పిలుపునిచ్చారు.

తన తండ్రి చంద్రబాబు ప్రపంచమంతా తిరిగి అనేక సంస్థలను హైదరాబాద్ తెచ్చారని, సైబరాబాద్ నగరాన్ని నిర్మించారని ఆయన చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు దత్తపుత్రుడు, దొంగ పుత్రుడు కలిసి హైదరాబాద్‌కు ఏ సంస్థనూ రానివ్వడంలేదని, ఉన్నవాళ్ళనూ భయపెట్టి బయటకు పంపుతున్నారని మండిపడ్డారు.
ఇక్కడకొస్తే వాటాలు అడిగారని, గుజరాత్ వెళ్ళి పరిశ్రమ పెట్టి 20 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చానని ఒక పారిశ్రామికవేత్త తనతో స్వయంగా చెప్పారని వెల్లడించారు. 'నేను మీలో ఒకడిని. మీతోపాటు తిరుగుతా. వాల్‌పోస్టర్లు కూడా అంటిస్తా. నేనూ మీలాంటి సామాన్య కార్యకర్తనే. అందరం కలిసి పార్టీని మళ్ళీ అధికారంలోకి తెద్దాం' అని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications