Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lokesh on Rk Roja : రోజా పేరు మార్చేసిన లోకేష్- నగరిలో ఐదుగురికే వాటాలు ! టీజింగ్ స్టార్ట్..

ఏపీలో తనను నిత్యం టార్గెట్ చేస్తున్న మంత్రి ఆర్కే రోజాను తన నియోజకవర్గం నగరిలో పాదయాత్ర సందర్భంగా లోకేష్ కౌంటర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను పిలుస్తున్న పేరును కూడా మార్చేసారు.

ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్ర చిత్తూరు జిల్లా నగరికి చేరుకుంది. నిన్న నగరికి చేరుకున్న పాదయాత్ర ఇవాళ కూడా కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజాను టార్గెట్ చేస్తూ ఇవాళ నారా లోకేష్ సెటైర్లు వేశారు.

తనను రోజుకో పేరుతో పిలుస్తూ టార్గెట్ చేస్తున్న ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాను ఆమె సొంత నియోజకవర్గంలో తన యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ కౌంటర్ టార్గెట్ చేశారు. చిత్తూరు జిల్లాలో యాత్ర ప్రారంభం కాగానే రోజాను గతంలో పవన్ కళ్యాణ్ పిలిచిన డైమండ్ రాణి పేరును కాస్త మార్చి డైమండ్ పాపగా పిలవడం మొదలుపెట్టిన లోకేష్.. దాన్ని ప్రతీచోటా వినిపిస్తున్నారు. దీంతో లోకేష్ పై రోజా కూడా కౌంటర్లు వేస్తున్నారు. తనను డైమండ్ పాప అంటావా అంటూ లోకేష్ ను రోజా పిత్రే అంటూ కూడా పిలుస్తున్నారు.

nara lokesh change rk roja name from diamond papa to jabardasth aunty-sattires in nagari

ఈ నేపథ్యంలో ఇవాళ చిత్తూరు జిల్లా నగరిలో పాదయాత్ర చేస్తున్న లోకేష్.. రోజాను డైమండ్ పాప పేరు నుంచి మరో పేరుకు మార్చేశారు. డైమండ్ పాప అని పిలుస్తావా అని రోజా అడుగుతున్నారని, కాబట్టి ఇకపై అలా పిలవకుండా జబర్జస్త్ ఆంటీ అంటానని చెప్పేశారు. ఈ సందర్భంగా నగరిలో ఏం జరుగుతుంటూ చెబుతూనే ఆమెను అదే పేరుతో లోకేష్ సంబోధించారు.

నగరిలో క్వారీల నుంచి జబర్జస్త్ ఆంటీ వాటా అడిగిందని, నగరి పరిస్దితి ఎలా ఉందంటే పుట్టినరోజు కేక్ కోసి పిల్లలకు ఇస్తామన్నట్లుగా ఉందన్నారు. జబర్దస్ట్ ఆంటీ నియోజకవర్గాన్ని సొంత బంధువులకు, కుటుంబ సభ్యులకు పంచిపెట్టిందన్నారు. నిండ్ర, పుత్తూరును రాం ప్రసాద్ రెడ్డికి, విజయపురం-కుమారస్వామిరెడ్డికి, నగరి మండలం-భర్త సెల్వమణికి ఇచ్చిందంటూ రోజాపై లోకేష్ విమర్శలు ఎక్కుపెట్టారు. రాత్రి ఐదుగురు కూర్చుని వాటాలు పంచుకుంటారన్నారు. ఎక్కడెక్కడ వాటాలు వచ్చాయో చర్చించుకుంటారన్నారు. భూకబ్జాలు కూడా జబర్జస్త్ గా చేస్తున్న జబర్జస్ట్ ఆంటీ అంటూ లోకేష్ రెచ్చిపోయారు.

ఈ సందర్భంగా నగరిలో రోజా ఎక్కడెక్కడ ఏయేం కబ్జా చేశారో లోకేష్ చెప్పారు. వైజాగ్ రుషికొండలోనూ కబ్జా చేసిందన్నారు. ఇసుక, గంజాయి, ఎర్రచందనం, బియ్యం స్మగ్లింగ్ చేస్తోందన్నారు. ఆస్ట్రేలియా, దుబాయ్, సింగపూర్ వెళ్లడం మీకిష్టం. అదే శ్రద్ధ ఇక్కడి చేనేతలపై పెట్టరా అని ప్రశ్నించారు. పేదలకు 300 యూనిట్ల విద్యుత్ ఇస్తామని జగన్ చెప్పారు. నగరిలో అమలవుతోందా అని లోకేష్ అడిగారు. నేతన్న నేస్తం అమలు కావడం లేదన్నారు. గాలేరు-నగరి పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, వేణుగోపాలపురం రిజర్వాయర్లో తట్ట మట్టీ ఎత్తలేదన్నారు. నగరిలో జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు సహా పలు హామీలు ఇచ్చినా అమలు చేయలేదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+