నారా లోకేష్ సవాల్, కెసిఆర్‌కు ఆర్నెళ్ల టైం: పొంగులేటి
హైదరాబాద్: తన పైన విమర్శలు చేస్తున్న వారి వాటిని నిరూపించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సోమవారం సవాల్ చేశారు. ఆయన ఓ టీవీ ఛానల్‌లో మాట్లాడారు. నారా లోకేష్ విదేశీ చదువుల ఫీజులు సత్యం రామలింగరాజు కట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆయన స్పందించారు.
విదేశాల్లో చాలా యూనివర్సిటీల్లో డొనేషన్లు కట్టి చదువుకోవచ్చునని కానీ, స్టాన్‌ఫోర్డ్‌లాంటి యూనివర్శిటీలో సీటు రావాలంటే సామాన్యమైన విషయం కాదన్నారు. తాను సాధించిన స్కోర్ల వల్లే తనకు సీటు వచ్చిందన్నారు. తనకు అప్పటికే హెరిటేజ్‌లో షేర్లు ఉన్నాయని చెప్పారు. తనకు కంపెనీ తరపున వచ్చిన డివిడెండ్లతోనే ఫీజు కట్టానన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారు వాటిని నిరూపించాలన్నారు.

వేంకటేశ్వర స్వామి వల్లే: చంద్రబాబు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతోనే గతంలో జరిగిన అలిపిరి ప్రమాదం నుంచి తాను ప్రాణాలతో బయటపడ్డానని చంద్రబాబు అన్నారు. ప్రజాసేవ చేసేందుకు స్వామి వారు తనకు పునర్జన్మను ప్రసాదించారన్నాపు, సీమాంధ్రను పునాదుల నుంచి నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆర్నెళ్ల టైమిస్తాం: పొంగులేటి
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి తాము ఆరు నెలల సమయం ఇచ్చి చూస్తామని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వేరుగా అన్నారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు. పార్టీలోని కొందరు ఇతర పార్టీలకు సహకరించారని విమర్శించారు. కొత్త ప్రభుత్వానికి తాము ఆర్నెళ్ల సమయం ఇచ్చి చూస్తామన్నారు.












Click it and Unblock the Notifications