బాబు కోసం లోకేష్ సైకిల్ యాత్ర: విశాఖ నుండి షర్మిల?

పార్టీకి యువకళ తీసుకు వచ్చేందుకు యువతను పార్టీ దిశగా ఆకర్షించడానికి ఆయన ఈ యాత్ర పెట్టుకొన్నారు. హైదరాబాద్‌లో కూడా ఆయన కొంతకాలంగా పార్టీ విద్యార్ధి విభాగం, యువత విభాగం నేతలతో తరచూ సమావేశమవుతూ వారిని క్రియాశీలంగా నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. క్షేత్ర స్ధాయిలో కూడా విస్తృతంగా పర్యటిస్తే యువతను ఆకర్షించడానికి వీలవుతుందని, దీనివల్ల పార్టీ బలోపేతం అవుతుందని కార్యకర్తల నుంచి సూచనలు రావడంతో ఆయన ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
రోజుకు ముప్పై కిలోమీటర్ల మేర యాత్ర చేసే ఉద్దేశ్యంతో ఉన్నారు. ఈ యాత్రలో టిడిపితోనే ప్రజలకు భద్రత, భవిష్యత్తు.. యువతకు విద్య, ఉద్యోగావకాశాలు ఉన్న నినాదాన్ని ప్రధానంగా తీసుకొని యాత్ర చేపట్టనున్నారు. గత పదేళ్లలో రాష్ట్రం ఎలా వెనుకబడింది వివరించనున్నారు. యాత్ర మార్గాల్లో గల కళాశాలల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటిస్తారు. అక్కడక్కడ యువతను ఉద్దేశించి మాట్లాడుతారు.
విశాఖ బరిలో షర్మిల?
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సోదరి షర్మిలకు ప్యాచప్ అయినట్లుగా ఇటీవలె వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. విశాఖ నుండి లోకసభ స్థానానికి షర్మిలను పోటీలో నిలపాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె పేరు దాదాపు ఖరారైందంటున్నారు.












Click it and Unblock the Notifications