AI: ఏపీ విద్యావ్యవస్థలో ఏఐ టూల్స్- కీలక మలుపు..!!

ఏపీ ప్రభుత్వం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ కు ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో అమరావతి కేంద్రం గా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ప్రతీ రంగంలో విస్తరిస్తు న్న ఏఐ ను ప్రభుత్వం విద్య వ్యవస్థలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. యువత భవిత కు మేలు చేసే విధంగా నైపుణ్య శిక్షణలోనూ ఏఐ టూల్స్ వినియోగం కోసం టోనీ బ్లెయిర్ తమ సంస్థ ద్వారా సహకరించేందుకు అంగీకరించారు.

ఏపీ ప్రభుత్వం ఏఐ వినియోగం అన్ని రంగాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ క్రమంలో భాగంగా విద్య, యువతకు నైపుణ్య శిక్షణలో ఏఐ టూల్స్ వినియోగం దిశగా కీలక అడుగు పడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో భేటీ అయ్యా రు. ఏపీలో​ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఏఐ టూల్స్​ వినయోగం పైన ఈ సమావేశం లో చర్చించారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు టోనీ బ్లెయిర్ ఇన్​స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్ (టీబీఐ) ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ అంగీకారం తెలిపారు. కాగా, విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి ఏపీ విద్యాశాఖ, టీబీఐ సంస్థ మధ్య 2024 డిసెంబర్​లో ఒప్పందం కుదిరింది.

Nara Lokesh discussions with Tony Blair on usage of AI in Skill development

అమల్లో భాగంగా విజయవాడలో టీబీఐ తమ ఎంబెడెడ్ బృందాన్ని ఉంచి రెండు ప్రధాన అంశాల పై దృష్టి సారించింది. రాష్ట్రంలో ఉన్నత విద్యలో సంస్కరణలు అమలు చేయటంతో పాటుగా.. గ్లోబల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్థాపన కోసం ఫోకస్ చేసింది. వీటి పురోగతి పైన టోనీ బ్లెయిర్, లోకేశ్ సమావేశమై సమీక్షించారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఇరువురి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. గ్లోబల్ ఇన్​స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డు లో చేరాల్సిందిగా టోనీ బ్లెయిర్​ ను మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. విశాఖలో జరిగే విద్యా మంత్రుల కాంక్లేవ్ కు టీబీఐ భాగస్వామిగా ఉండేందుకు టోనీ బ్లెయిర్ ఆమోదం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+