ఎప్పుడో చెప్పండి: జగన్ ఇలాకాలో లోకేష్‌కు చేదు అనుభవం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్‌కు చేదు అనుభవం ఎదురయింది.
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్‌కు చేదు అనుభవం ఎదురయింది.
లోకేష్ బుధవారం కడప జిల్లా వల్లూరు మండలం తప్పెట్లలో పర్యటించారు. ఆయన స్థానిక మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు ఆయనను నిలదీశారు.

మహిళలతో మాట్లాడుతూ.. ఇక్కడ రోడ్లు వేశారా, పంటలకు నీళ్లు ఇచ్చారా అని లోకేష్ అడిగారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పిన మహిళలు. డ్వాక్రా రుణమాఫీ ఏమయిందని ప్రశ్నించారు. ఇంకా ఎప్పుడు రుణమాఫీ చేస్తారన్నారు. వారికి సర్ది చెప్పేందుకు లోకేష్ ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications