9.8 లక్షల కోట్ల పెట్టుబడులు- 7.5 లక్షల జాబ్స్-లోకేష్ కీలక ప్రకటన..!

విశాఖపట్నంలో ఈ నెల 14,15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతూన్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ సదస్సులో పెద్దఎత్తున పెట్టుబడి చర్చలు జరుగుతాయని, పారిశ్రామికవేత్తలతో పాటు పాలసీ మేకర్లు హాజరై రాబోయే పదేళ్లలో పారిశ్రామికరంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అందులో భారత్, ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏమిటి అనే అంశాలపై విస్తృతమైన చర్చలు జరుగుతాయన్నారు.

ఇప్పటివరకు ఈ సదస్సుకు 45దేశాల నుంచి 300మంది వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, కేంద్రమంత్రులు వస్తున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. సదస్సులో 12 మల్టీ లాటరల్ ఆర్గనైజేషన్స్, 72మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ పాల్గొంటారని లోకేష్ తెలిపారు. 48 స్పీకింగ్ సెషన్స్ లో సెక్టార్లవారీగా వివిధ అంశాలపై విస్తృతంగా చర్చలు జరుపుతామన్నారు. పార్టనర్ షిప్ సమ్మిట్ లో 410 ఎంవోయూలపై సంతకం చేయబోతున్నట్లు తెలిపారు. వీటిద్వారా రూ.9.8లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5లక్షల ఉద్యోగావకాశాలు రాబోతున్నాయని అంచనా వేశారు.

Nara Lokesh Forecasts 9 8 Lakh Crore Investments and 7 5 Lakh Jobs at Vizag CII Summit

కూటమి ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు మంత్రులందరం మిషన్ మోడ్ లో పనిచేస్తున్నామని లోకేష్ తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులందరం కలసికట్టుగా పనిచేసి బెస్ట్ ఇన్ క్లాస్ పాలసీలను తీసుకువచ్చినట్లు తెలిపారు. దీనివల్ల గత 16నెలల్లో రాష్ట్రానికి పెద్దఎత్తున పరిశ్రమలు తరలివచ్చాయన్నారు. సరైన ఎకోసిస్టమ్ లేకపోవడం వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని గుర్తించామని, తెలుగువారు ప్రపంచాన్ని శాసిస్తున్నా వారు స్థానికంగా పనిచేయకపోవడానికి అదే ప్రధాన కారణమని తెలిపారు. అందువల్లే పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టిపెట్టామని, ఫలితంగా గత 16నెలల్లో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (రూ.10లక్షల కోట్లు) ఏపీకి వచ్చాయన్నారు.

Nara Lokesh Forecasts 9 8 Lakh Crore Investments and 7 5 Lakh Jobs at Vizag CII Summit

అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ ద్వారా రూ.1.5లక్షల కోట్లు, దేశచరిత్రలో అతిపెద్ద ఎఫ్ డీఐ గూగుల్ $15 బిలియన్ డాలర్లు, నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ లక్ష కోట్లు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ 1.25లక్షల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని లోకేష్ తెలిపారు. డొమెస్టిక్ ఇన్వెస్టిమెంట్ లోనే కాకుండా ఎఫ్ డీఐలలో కూడా ఏపీ నెం.1గా నిలుస్తూ ముందుకు సాగుతోందన్నారు. ఏపీలో అవలంభిస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్లే కంపెనీలు తమ పెట్టుబడులకు ఏపీని ఎంచుకుంటున్నాయన్నారు. పక్కరాష్ట్రాలు కూడా పోటీపడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నా ఏపీ వైపు మొగ్గుచూపడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాలే కారణమన్నారు. టీసీఎస్, ప్రీమియర్ ఎనర్జీ, రెన్యుపవర్ వంటి భారీ కంపెనీలు అందువల్లే క్యూకట్టాయని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+