నారా లోకేష్ కోసం చంద్రబాబు మరో ఎత్తుగడ: బాలకృష్ణ కార్నర్?

హైదరాబాద్: తన వారసుడిగా తనయుడు నారా లోకేష్‌ను నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తున్నారు. తన వారసుడిగా, భవిష్యత్తు టిడిపి అధినేతగా, ముఖ్యమంత్రిగా నారా లోకేష్‌ను ముందుకు తీసుకురావడానికి ఆయన ప్రణాళికబద్దంగా అడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు.

రాష్ట్ర మంత్రివర్గంలోకి నారా లోకేష్‌ను తీసుకోవడం దాదాపుగా ఖాయమైనట్లు ప్రచారం సాగుతోంది. దాదాపుగా నందమూరి వంశాన్ని పక్కకు నెట్టిన చంద్రబాబు ఇప్పుడు బాలకృష్ణను కూడా వారసత్వం నుంచి దూరం చేయడానికి ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. తనయుడికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా అనుభవం ఉందనే కారణంతో భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ఆయనను ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Nara Lokesh gets vabinet berth: balakrishna cornered

ఈ పరిస్థితిలో నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వకపోవచ్చునని అంటున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న స్థితిలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కారణంతో బాలకృష్ణను పక్కకు పెట్టవచ్చునని అంటున్నారు.

బాలకృష్ణను వివిధ కారణాలు చెప్పి మంత్రి పదవికి దూరంగా ఉంచే అవకాశమే ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇప్పటికే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్సిగా ఉన్న నారా లోకేష్ మరో మెట్టు పైకి ఎక్కి మంత్రి పదవిని దక్కించుకుని నారావారి వారసత్వాన్ని నిలబెట్టడానికి సిద్ధమవుతాడని అంటున్నారు.

మంత్రి పదవి పొందిన తర్వాత శాసన మండలికి ఎన్నిక కావడం కన్నా శాసనసభకు ఎన్నిక కావడాన్నే నారా లోకేష్ ఎన్నుకోవచ్చునని అంటున్నారు. ఆయన కోసం ఏదైనా నియోజకవర్గాన్ని ఖాళీ చేయించి, పోటీ చేయించే అవకాశాలున్నాయని అంటున్నారు. మంత్రిగానే కాకుండా భావి ముఖ్యమంత్రిగా, టిడిపి నేతగా ఎన్నికల్లో విజయం సాధించడం కష్టం కాదని అంటున్నారు. ఏమైనా, బాలకృష్ణ అల్లుడి కోసం త్యాగం చేయక తప్పని పరిస్థితి వస్తుందని వినికిడి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+