Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉడత వల్లే ఆటో దగ్ధం, కూలీల సజీవదహనం-ఎస్పీడీసీఎల్ అధికారులు వెల్లడి-లోకేష్ సెటైర్లు

శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు పడి ఐదుగురు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రభుత్వ యంత్రాంగం హడావిడిగా పరుగులు తీసింది. ఈ ఘటనకు బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని, బాధితుల, మృతుల కుటంబాల్ని ఆదుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనకు గల కారణంపై ఎస్పీడీసీఎల్ చేసిన ప్రకటన వివాదాస్పదమవుతోంది.

సత్యసాయి జిల్లాలో ఆటో దుర్ఘటన

శ్రీ సత్యసాయి జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన ఆటో దగ్ధం ఘటన కలకలం రేపుతోంది. పొట్ట కూటి కోసం బయలు దేరిన కూలీల్ని హైటెన్షన్ వైర్లు ఆటోమీద పడి పొట్టనపెట్టుకున్న ఘటన అందరిలోనూ ఆవేదన నింపుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రుల్ని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తోంది. మృతులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించింది. అయితే ఈ ఘటన జరిగిన తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అధికారుల నిర్లక్ష్యం కూడా ఈ సందర్భంగా తెరపైకి వస్తోంది.

 ఉడుతే కారణమన్న ఎస్పీడీసీఎల్

ఉడుతే కారణమన్న ఎస్పీడీసీఎల్

ఇవాళ సత్యసాయి జిల్లాలో జరిగిన ఆటో దగ్ఘం, కూలీల సజీవదహనం ఘటనతో ఉలిక్కిపడ్డ జనం.. ఈ ఘటనకు గల కారణాలపై ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో స్ధానికంగా ఉన్న విద్యుత్ శాఖ అధికారులపైనా ఒత్తిడి పెరిగింది. దీంతో వీరు ఆటో దగ్ధం ఘటనకు ఉడుతే కారణమంటూ ఓ ప్రకటన చేశారు. ఉడుత హైటెన్షన్ వైర్లపైకి వెళ్లడం వల్లే అవి షార్ట్ అయి తెగి పడ్టాయనేది ఎస్పీడీసీఎల్ వాదనగా కనపిస్తోంది. అయితే సమగ్ర విచారణ జరపకుండా ఎస్పీడీసీఎల్ చేసిన ఈ ప్రకటన బాధ్యతా రాహిత్యంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Recommended Video

    YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
    ఉడుత కారణంపై లోకేష్ సైటైర్లు

    ఉడుత కారణంపై లోకేష్ సైటైర్లు

    తేనెటీగల వల్ల రథం తగలబడటం,ఎలుకలు మందు తాగడం,కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం,ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయి.ఇంకా నయం!కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పలేదు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సెటైర్లు వేశారు. ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే, కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథల కహానీలు చెప్పించడం వైసీపీ సర్కారుకి అలవాటైపోయిందంటూ మరో ట్వీట్ లో లోకేష్ విమర్శించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+