Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీతో పొత్తు - పార్టీ మేనిఫెస్టో పై లోకేశ్‌ కీలక వ్యాఖ్యలు..!!

రానున్న ఎన్నికల్లో పొత్తులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇతర పార్టీలతో పొత్తుల విషయం పార్టీ అధినేత చంద్రబాబు చూసుకుంటారని చెప్పుకొచ్చారు. అదే సమయం లో జనసేనాని పవన్ తో పార్టీ చీఫ్ చంద్రబాబు, తాను పొత్తులపై ఆరేడు సార్లు కూర్చుని మాట్లాడుకున్నామని వెల్లడించారు. బీజేపీతో పొత్తు అంశం పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. మహానాడులో టీడీపీ మేనిఫెస్టో దాదాపు ఖరారైందని.. 80 శాతం మహానాడులో ప్రకటించినవే ఉంటాయని తెలిపారు.

పొత్తులపై క్లారిటీ:వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పొత్తుతో ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. బీజేపీ నుంచి ఇందుకు సానుకూల సంకేతాలు వస్తున్నట్లు కనిపించటం లేదు. ఈ సమయంలో టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. పవన్ కల్యాణ్ తో మాత్రం పొత్తులపై ఆరేడు సార్లు చర్చలు జరిగాయని చెప్పిన లోకేష్..మహానాడు కారణంగా ఇటీవల కలవలేదన్నారు. మళ్లీ పవన్ - చంద్రబాబు ఇద్దరూ కూర్చుంటారని తెలిపారు. బీజేపీ పొత్తు అంశం ప్రస్తావన సమయంలో..మేమేమైనా పొత్తు కోసం ఆ పార్టీని కలిశామా అని ప్రశ్నించారు. కొద్ది రోజులుగా సీఎం జగన్ కు అనుకూలంగా బీజేపీ వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఆ పార్టీ నుంచి వస్తున్నాయి. దీంతో..ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యలతో ఈ పార్టీతో పొత్తుపై ఇక ఉండదనే స్పష్టత వచ్చినట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి,

Nara Lokesh made crucial comments on allilance with BJP, gave clarity on manifesto

మేనిఫెస్టోలో అవే:మహానాడులో టీడీపీ మేనిఫెస్టో దాదాపు ఖరారైందని.. 80 శాతం మహానాడులో ప్రకటించినవే ఉంటాయని స్పష్టం చేసారు. చంద్రబాబు ఒక బ్రాండ్‌. పరిశ్రమలు వస్తాయన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ అనుబంధంగా కేజీ నుంచి పీజీ వరకు సిలబస్‌ మారుస్తామని వివరించారు. అప్పుడు దేశంలో ఎక్కడా లేని చదువుకున్న యువత మన దగ్గర ఉంటారన్నారు. కంపెనీలు క్యూ కడతాయని... జగన్‌ నాలుగేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని దుయ్యబట్టారు. రాష్ట్రం అటుంచు.. సొంత జిల్లా కాదు.. కనీసం పులివెందులకు కూడా ఒక్క పరిశ్రమ తేలేదని ఆక్షేపించారు. తామొస్తే కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పూర్తి చేస్తామని లోకేష్ స్పష్టం చేసారు. రాయలసీమ అభివృద్ధిపై కడప జిల్లాలో పాదయాత్ర ముగించేలోపే ప్రణాళిక విడుదల చేస్తామని వెల్లడించారు.

ఇన్‌చార్జులను మార్చేస్తాం:పనిచేయని టీడీపీ ఇన్‌చార్జులను మార్చేస్తామని లోకేష్ చెప్పారు. ప్రజల్లో ఉండి పనిచేసేవారికే పదవులు వస్తాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేసారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న జగన్‌.. వారంలో రద్దుచేస్తానన్న సీపీఎస్‌ ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. 45 ఏళ్లు దాటిన మహిళలకు పింఛన్‌ హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు. మద్య నిషేధం, ప్రత్యేక హోదా, మెగా డీఎస్సీ, 2.30లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు మరికొన్ని హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పి ఎన్నికలకు వెళ్లాలని లోకేష్ డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేతలను దత్తత తీసుకుంటున్నట్లు లోకేష్ వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+