సీఎం జగన్ బెయిల్, అవినాశ్ పై లోకేశ్ సంచలన ఆరోపణలు..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు భద్రతపై నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబును చంపేస్తామని బాహాటంగా వైసిపి నేతలు చెబుతున్నారని లోకేశ్ ఆరోపించారు. చంద్రబాబును బంధించి ఇవాళ్టికి 50 రోజులైందని... ఏ తప్పూ చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే అరెస్టు చేశారని ఆరోపించారు.రాష్ట్రంలో వ్యక్తిగత కక్ష సాధింపులు ప్రత్యక్షంగా చూస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఇన్ని రోజులు జైలులో ఉండటానికి చెప్పిన కారణాలు వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబుతో ములాఖత్ : రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్ ములాఖత్ అయ్యారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజల మధ్యకు చంద్రబాబును రానీయకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోయేందుకు కష్టపడటం సహజమే కానీ చంద్రబాబు చనిపోవాలి.. చంద్రబాబును చంపేస్తామని బాహాటంగా వైసిపి నేతలు చెబుతున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు. బెయిల్‌పై జగన్ పదేళ్లు ఎలా బయట వున్నారని ప్రశ్నించారు. అవినాశ్ పైన సంచలన ఆరోపణలు చేసారు. చంద్రబాబు చనిపోవాలి.. చంద్రబాబును చంపేస్తామని వైసీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కేసుతో ఎలాంటి సంబంధం లేని తన తల్లి భువనేశ్వరిని కూడా జైలుకు పంపిస్తామని వైసీపీకి చెందిన మహిళా మంత్రి మాట్లాడుతున్నారన్నారు.

ఏ తప్పు చేయలేదు : చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని లోకేశ్ చెప్పారు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో ఉంచి ఏం సాధించారని ప్రశ్నించారు. వైసీపీ అరాచకాలను వదిలేది లేదని హెచ్చరించారు. దమ్ముంటే ఎక్కడ అవినీతి జరిగిందో చూపించాలని సవాల్ చేసారు. కంటి డాక్టర్ ఆపరేషన్ అవసరం అని చెబితే ఆ డాక్టర్‌పై జైలు అధికారులు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. జైలు ఆధికారులకు స్వేచ్ఛ లేదన్నారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి రెండు రిపోర్టర్లు తమ వద్ద ఉన్నాయని లోకేశ్ చెప్పుకొచ్చారు. ఆపరేషన్ అవసరం అని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ కూడా తమ దగ్గరుందన్నారు. అర్జెంట్ లేదని ఇప్పించిన రిపోర్ట్ కూడా ఉందని చెప్పారు. ఆపరేషన్ అవసరం అని డాక్టర్ రిపోర్ట్ ఇస్తే అదే డాక్టర్‌తో.. ఆపరేషన్ అర్జెంట్ కాదని రిపోర్ట్ ఇప్పించారని లోకేష్ ఆరోపించారు.
సమాధానం చెప్పాలి : జైల్లో డ్రోన్‌లు ఎగురుతున్నాయో చెప్పాలన్నారు. చంద్రబాబు జైల్లోకి వెళ్లేటప్పుడు ఫోటోలు బయటకు వచ్చాయని లోకేశ్ ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. సజ్జల జైళ్లు శాఖ డీఐజీతో ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నారని నిలదీసారు. చంద్రబాబు 72 నుంచి 66 కిలోలకు బరువు తగ్గారని వివరించారు. కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లపై ముఖుల్ రోహిత్గీతో వాయిదాలు వేయిస్తున్నారని వ్యాఖ్యానించారు. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్‌వర్మ సమాజానికి ఏం చేశాడని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ విషయమై కాసాని జ్ఞానేశ్వరి హైదరాబాద్‌లో మీడియాతో చెబుతారని లోకేశ్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications