మోడీపై అసంతృప్తి: లోకేష్‌కు మంత్రి పదవిపై ట్విస్ట్, సుజనకు ఊరట
విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ఢిల్లీకి పంపిస్తారనే ఊహాగానాలు ఇటీవల వచ్చాయి. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న సుజనా చౌదరి రాజ్యసభ గడువు త్వరలో ముగియనుంది. ఆయన స్థానంలో లోకేష్‌ను ఢిల్లీకి పంపిస్తారని, కేంద్రమంత్రిని చేస్తారనే ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే, దీనిపై తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. లోకేష్‌ను ఢిల్లీకి పంపించే విషయమై చంద్రబాబు అయిష్టంగా ఉన్నప్పటికీ, టిడిపి నేతలు ఆయన పైన ఒత్తిడి తెచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం ఢిల్లీకి పంపించే విషయమై యూ టర్న్ తీసుకున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే, విభజన నేపథ్యంలో ఏపీకి కేంద్రం నుంచి ఆశించిన సహకారం అందడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. దీనిని ఇప్పటికే ప్రతిపక్షం క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. బిజెపితో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఏపీకి నిధులు తీసుకు రావడంలో విఫలమవుతున్నారని ఆరోపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్‌ను కూడా కేంద్రానికి పంపించి మరో అవకాశం ప్రతిపక్షానికి ఇవ్వవద్దని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తండ్రీకొడుకులు పదవులు పొందారు కానీ, కేంద్రం నుంచి నిధులు తీసుకు రావడంలో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు రావొచ్చని, అందుకే లోకేష్‌ను ఢిల్లీకి పంపక పోవడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో మరో రకమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోకేష్‌ను ఏపీకి పంపించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఓ నామినేటెడ్ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి, లోకేష్‌కు ఆ పదవిని కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
త్వరలో జరగనున్న ఏపీ కేబినెట్ విస్తరణలో లోకేష్‌కు మంత్రి పదవి దక్కినా దక్కవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోకేష్‌కు ఐటీ మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కొందరు నేతలు సూచిస్తున్నారని తెలుస్తోంది. తద్వారా లోకేష్‌ను ప్రభుత్వపరంగా కూడా రాజకీయాల్లో కీలకంగా ఉండేలా చూడాలని బాబుకు చెబుతున్నారట.
2014 జూన్ 8వ తేదీన చంద్రబాబు మంత్రివర్గం ఫాం అయింది. ఇప్పటి వరకు పునర్ వ్యవస్థీకరణ జరగలేదు. త్వరలో జరగనుందని తెలుస్తోంది. ఈ జూన్ నెలలో ఉండే అవకాశముందని అంటున్నారు. లోకేష్‌ను ఏపీకి పరిమితం చేయడం సుజనకు ఊరట చెందే అంశమేనని చెప్పవచ్చు.
గతంలో సుజనను తప్పించి లోకేష్‌ను ఢిల్లీకి పంపిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, సుజన స్థానంలో లోకేష్ కాకపోయినా మరొకరిని అపాయింట్ చేస్తారా, లేకే మరోసారి అతనికే అవకాశమిస్తారా అనేది మాత్రం ముందు ముందు తేలనుంది.












Click it and Unblock the Notifications