Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి: దావోస్ లో నారా లోకేష్

దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ వెళ్లిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తొలి రోజు బిజీ బిజీగా గడిపారు. తొలుత జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. ఏపీలో 18 నెలల్లో రూ.23.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్నామని వివరించారు. వీటిద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఒక్క ఏపీకే వచ్చాయని తెలిపారు.

జ్యూరిచ్‌లో ఆయనకు ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో సమావేశం అయ్యారు. తమ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి అని అభివర్ణించారు. తెలుగుజాతి గర్వపడే విధంగా ఏపీ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

Nara Lokesh meets Chairman of Buhler Group in Zurich

అనంతరం బుల్హర్ గ్రూప్ ఛైర్మన్ దీపక్ మానేతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ ఎగుమతి క్లస్టర్లను బలోపేతం చేయడానికి, మిల్లెట్ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించడానికి, ఫుడ్-టెక్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. దీనివల్ల ఏపీ.. దేశంలోనే అగ్రి హబ్ గా నిలుస్తుందని లోకేష్ పేర్కొన్నారు.

అనంతరం స్పానిష్ సంస్థ ఈవీఓ ఎస్ ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ జోస్ మెల్లాడోతో సమావేశం అయ్యారు. గ్రీన్ హైడ్రోజన్, జీరో ఎమిషన్ మొబిలిటీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి చర్చించారు. ఆయా రంగాల్లో ఏపీ అభివృద్ధి చెందుతోందని, విశాఖ/కాకినాడ పోర్టుల్లో హైడ్రోజన్ టెర్మినల్ ట్రాక్టర్ల పైలట్‌, ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఆఫ్ రోడ్ వాహనాల తయారీకి ఆ సంస్థను ఆహ్వానించారు. అవసరమైన టెస్ట్‌బెడ్స్, అనుమతులు, ఇంజినీరింగ్ శాండ్‌బాక్స్‌లు, ప్రోటోటైప్‌కు సహకారం అందిస్తామని చెప్పారు.

1990ల నుండీ ప్రపంచ ఆర్థిక వేదిక గణనీయంగా అభివృద్ధి చెందిందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ తొలి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లలో ఒకరిగా నిలిచారని గుర్తు చేశారు. ప్రస్తుతం దావోస్ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే వేదిక మాత్రమే కాదని, వ్యాపారం, సాంకేతికత, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించే ప్లాట్‌ఫామ్‌గా మారిందని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+