అమిత్ షాతో నారా లోకేష్ భేటీ: చంద్రబాబు అరెస్టుపై హోంమంత్రి ఏమన్నారంటే?

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలుగుదేశం పార్టీ కీలక నేత నారా లోకేష్ బుధవారం కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కారు కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు, విచారణ పేరుతో తనను వేధిస్తున్నట్లు కేంద్రమంత్రికి వివరించారు.

చివరకు తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నారా లోకేష్.. అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు? నీపై ఎన్ని కేసులు పెట్టారు? అని అమిత్ షా.. లోకేష్‌ని అడిగి తెలసుకున్నారు.

 Nara lokesh meets home minister amit shah on chandrababu arrest issue

కక్ష సాధింపుతో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షాకు నారా లోకేష్ వివరించారు. కాగా, 73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిని కేసుల పేర్లతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉందని అమిత్ షా.. నారా లోకేష్ ను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని లోకేష్‍‌తో అమిత్ షా చెప్పినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, అధికార నేతల పగబట్టి తీరును అమిత్ షాకు లోకేష్ వివరంగా వివరించారు. ఇప్పుడు కేంద్రంపై నిందలు వేసే వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉంటే అమిత్ షా.. లోకేష్‌కి ఎందుకు అపాయింట్‌మెంట్ ఇస్తారూ అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+