వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ భారతి వీడియో పోస్ట్ చేసి.. జగన్ ను టార్గెట్ చేసిన నారా లోకేష్

|
Google Oneindia TeluguNews

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలుపై, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలను అడుగడుగునా మోసం చేస్తూ జగన్ మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని లోకేష్ మండిపడుతున్నారు. తాజాగా అమ్మఒడి పథకంపై ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన లోకేష్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. వైయస్ భారతి మాట్లాడిన ఒక వీడియోను పోస్ట్ చేసి మరీ జగన్ ను టార్గెట్ చేశారు.

ఎమ్మెల్యే ఆళ్ళ లక్ష్యంగా.. మంగళగిరిలో లోకేష్ పర్యటనలు; విమర్శనాస్త్రాలు; సక్సెస్ అవుతారా?ఎమ్మెల్యే ఆళ్ళ లక్ష్యంగా.. మంగళగిరిలో లోకేష్ పర్యటనలు; విమర్శనాస్త్రాలు; సక్సెస్ అవుతారా?

భారతి వీడియో పోస్ట్ చేసి జగన్ ను టార్గెట్ చేసిన లోకేష్

గతంలో అమ్మఒడి పథకం గురించి వైయస్ భారతి వివరించిన వీడియోను పోస్ట్ చేసిన నారా లోకేష్ జగన్ ను టార్గెట్ చేశారు. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు ఉంది జగన్ మోసపు రెడ్డి అమ్మ ఒడి పధకం తీరు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమ్మ ఒడి పథకాన్ని తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 కోత పెట్టి అర్ద ఒడిగా మార్చారు అంటూ మండిపడ్డారు.

 కండిషన్స్ అప్ప్లై అని ముందే ఎందుకు చెప్పలేదు జగన్ మోసపు రెడ్డి గారు: లోకేష్

కండిషన్స్ అప్ప్లై అని ముందే ఎందుకు చెప్పలేదు జగన్ మోసపు రెడ్డి గారు: లోకేష్


ఇప్పుడు అమ్మ ఒడి పథకంపై ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి మనబడి ప్రశ్నార్థకంగా మార్చేశారని నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 యూనిట్లు దాటి కరెంట్ వాడితే అమ్మ ఒడి పథకం కట్, ప్రతి విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి, ఆధార్‍లో కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలి, కొత్త బియ్యం కార్డు ఉంటేనే అమ్మఒడిలాంటి కండిషన్స్ అప్ప్లై అని ముందే ఎందుకు చెప్పలేదు జగన్ మోసపు రెడ్డి గారు? అంటూ లోకేష్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. అంతేకాదు వైయస్ భారతి నాడు ఇచ్చిన హామీలు కూడా మరిచిపోయారని ఎద్దేవా చేశారు.

 మీ సతీమణి ఇచ్చిన హామీలు కూడా గంగలో కలిపేశారుగా

మీ సతీమణి ఇచ్చిన హామీలు కూడా గంగలో కలిపేశారుగా


మీ సతీమణి గారు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే 30 వేల రూపాయలు అమ్మ ఒడి కింద ఇస్తామని ఇచ్చిన హామీలు కూడా గంగలో కలిపేశారు అంటూ లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమ్మలని మానసిక క్షోభకు గురి చేసే ఆంక్షలను తీసేసి అర్హులందరికీ అమ్మఒడి పథకాన్ని వర్తింపజేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

అమ్మ ఒడి పథకానికి జగన్ సర్కార్ ఆంక్షలు

అమ్మ ఒడి పథకానికి జగన్ సర్కార్ ఆంక్షలు


ఇదిలా ఉంటే అమ్మఒడి పథకానికి జగన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. విద్యార్థుల హాజరు నుంచి వారి ఇళ్ళల్లో విద్యుత్ బిల్లు వరకూ నిర్దేశించిన ప్రకారం ఉంటేనే అమ్మఒడి సాయం అందుతుందని ప్రభుత్వం పేర్కొంది. అమ్మ ఒడి లబ్ధిదారులు ఇళ్లల్లో మూడు వందల యూనిట్లకు మించి విద్యుత్ వాడకం ఉంటే వారు అమ్మఒడి పథకానికి అర్హత కోల్పోతారు. అలాగే 75 శాతం హాజరు తప్పనిసరి గా ఉంటేనే ఆ విద్యార్థులకు అమ్మ ఒడి పథకం అమలు అవుతుంది.

Recommended Video

NTR Is The Vaccine For CBN, Lokesh Viruses ఎన్టీఆర్ అనే వ్యాక్సిన్ వేయించుకోండి || Oneindia Telugu
ఆధార్ కార్డులో పాత జిల్లాల పేరు మార్చి కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలి

ఆధార్ కార్డులో పాత జిల్లాల పేరు మార్చి కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలి

ఇక బియ్యం కార్డు కొత్తది ఉండాలని, విద్యార్థి కేవైసీ అప్డేట్ చేసుకోవాలని, ఆధార్ తో బ్యాంకు ఖాతా లింక్ అయ్యిందో లేదో సరిచూసుకోవాలని కూడా సూచించింది.
ఇక ఇదే సమయంలో ఆధార్ కార్డు లో పాత జిల్లాల పేరు మార్చి కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలని కూడా ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థుల చదువు కోసం అమ్మఒడి ద్వారా లబ్ధి చేకూరాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వం విధించిన వివిధ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలి. అలా పాటిస్తేనే అమ్మఒడి పథకం వర్తిస్తుంది.

English summary
Nara Lokesh posted a video of YS Bharathi and targeted Jagan over amma odi scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X