వండర్‌ఫుల్ పర్సన్: పవన్ కల్యాణ్‌కు నారా లోకేష్ గ్రీటింగ్స్
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ పొగిడేశారు. పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.
Happy Birthday to @PawanKalyan, a wonderful person and a warm human being! Have a wonderful year ahead!
— Lokesh Nara (@naralokesh) 2 September 2016
పవన్ కళ్యాణ్ అద్బుతమైన వ్యక్తని నారాలోకేష్ అన్నారు. పవన్ ఒక వండర్‌ఫుల్ పర్సన్ అని, అరుదైన వ్యక్తిత్వం గల మనిషని ఆయన అన్నారు. సెప్టెంబర్ 2, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు పలు మార్గాల ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలో నారా లోకేష్ పవన్‌కు సోషల్ మీడియా ద్వారా బర్త్‌డే విషెస్ తెలిపారు. పవన్ ఒక వండర్‌ఫుల్ పర్సన్ అని, సరైన వ్యక్తిత్వం కలిగిన మనిషని లోకేష్ అన్నారు. పవన్‌కు రానున్న రోజులు మరింత బాగుండాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రత్యేక హోదా కోసం పవన్ కల్యాణ్ ఉద్యమిస్తున్న తరుణంలో నారా లోకేష్ చేసిన ట్వీట్ వెనక రాజకీయం కూడా ఉండవచ్చునని భావిస్తున్నారు. తమ పార్టీకి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ పనిచేయకుండా జాగ్రత్త పడడంలో భాగంగానే నారా లోకేష్ ఆ ప్రశంసలు చేసినట్లు అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications