బాబు ట్విట్టర్ అకౌంట్‌పై లోకేష్: జగన్, తెరాసకు సవాల్

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ఖాతా తెరవడంపై ఆయన తనయుడు నారా లోకేష్ స్పందించారు. లోకేష్ గత కొంతకాలంగా పలు అంశాలపై ట్విట్టర్‌లో స్పందిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు బుధవారం ట్విట్టర్ ఖాతా తెరవడంపై లోకేష్ స్పందించారు.

ముందుచూపు గల మన నాయకుడు, నా తండ్రికి హృదయపూర్వక ఆహ్వానం అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఇటీవల చంద్రబాబు తన, తన కుటుంబ ఆస్తులను ప్రకటించిన అంశం పైన అంతకుముందు స్పందించారు. బాబు తన ఆస్తులను ప్రకటిస్తున్నప్పుడల్లా ఇతర పార్టీల నేతలు అక్రమాస్తులు అంటూ వాటిని నిరూపించలేకపోతున్నారని, కాంగ్రెసు, ఆ పార్టీ బ్రాంచీలు వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు తమ ఆస్తులను ప్రకటించగలవా అని సవాల్ చేశారు.

Nara Lokesh and Nara Chandrababu Naidu

కాగా, టెక్ సావీగా పేరు పొందిన రాష్ట్ర చంద్రబాబు ట్విట్టర్ ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. 1984లోని తన మొదటి కంప్యూటర్ నుంచి ట్విట్టర్‌లోకి ఈ రోజు అని ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ప్రభుత్వంలో పారదర్శకత, నిబద్ధత నుంచి ఉద్యోగల కల్పనకు.. టెక్నాలజీకి థ్యాంక్స్ అని ఆయన ట్వీట్ చేశారు. దానికి తోడు మరో రెండు ట్వీట్స్ కూడా చేశారు.

"99-04 6,00,00,000 నెట్ జాబ్స్ యాడెడ్. 2004-09 జీరో నెట్ జాబ్స్ యాడెడ్. యుపిఎ అవినీతి. క్యాన్సర్ ఉద్యోగాలను తినేస్తోంది. చర్యకు దిగండి" అని ఆయన ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+