బ్లూ మీడియాకు వార్నింగ్, మాతో పెట్టుకుంటే ?, నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు బ్లూ మీడియా చంద్రబాబుపై విషపూరిత రాతలు రాసిందని, ఇప్పుడు కూడా అదే పని చేస్తోందని, ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ వైసీపీపై, బ్లూ మీడియాపై మండిపడ్డారు.

ప్రజా కోర్టులో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిందని, బ్లూ మీడియాపై వేసిన పరువు నష్టం కేసులో కూడా మేమే గెలుస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు చేసిన మంచి పనులను కొంతమంది మర్చిపోయారని, అదే సమయంలో జగన్ మాయమాటలు నమ్మి 2019లో వైసీపీని ఆదరించారని మంత్రి నారాయణ లోకేష్ అన్నారు. అయితే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని నారా లోకేష్ ఆరోపించారు

Nara Lokesh said that legal action will be taken if the Andhra Pradesh government spreads false propaganda

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను గత వైసీపీ ప్రభుత్వం లూటీ చేసిందని ప్రతి సామాన్యుడిపై భారం మోపిందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. ఐదు సంవత్సరాల తర్వాత జగన్ బండారం బయటపడడంతో ప్రజల వైసీపీని తిరస్కరించారని, ఎన్డీఏ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని ఆంధ్రప్రదేశ మంత్రి నారా లోకేష్ చెప్పారు.

అధికారానికి దూరమైన జగన్ అతని బ్లూ మీడియా ఎన్డీఏ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని, ఇలాగే ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా కుటుంబాన్ని ఆదరించి ఆరుసార్లు అధికారంలో ఉండటానికి అవకాశం ఇచ్చారని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేయడానికి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు.

ప్రజలు వైసీపీని తిరస్కరించినా బ్లూ మీడియా మాత్రం జగన్ ను నెత్తిన పెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. బ్లూ మీడియా ఇలాగే ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. సాక్షి పత్రిక పైన వేసిన పరువు నష్టం దావా కేసులో మేమే విజయం సాధిస్తామని, న్యాయస్థానాలపైన మాకు పూర్తిగా నమ్మకం ఉందని, కోర్టులను మేము గౌరవిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+