క్షమించండి.. హెల్ప్ చేయలేను అంటున్న నారా లోకేష్.. ట్వీట్ వైరల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాల నియంత్రణకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా పోలీసులు నేరాల నియంత్రణకు టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నారు. ఈ మేరకు డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పలు ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే గుడివాడ పరిధిలో ఇంజినీరింగ్ కాలేజీ వెనుక బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించారు.
మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు గుర్తించారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారంటూ వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అయితే యువకులు మద్యం తాగుతుండగా.. డ్రోన్ ని చూసి వారిచ్చిన రియాక్షన్స్ కామెడీగా మారాయి. ఆ వీడియోకి 'మన్మథుడు' సినిమాలోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ జోడించారు. ఆ వీడియోను కృష్ణా జిల్లా పోలీస్ డిపార్ట్ మెంట్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఆ పోస్టును మంత్రి నారా లోకేశ్ రీపోస్ట్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ మేరకు ఆ పోస్టులో.. పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తోంది. సారీ గయ్స్.. నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నా.. ఎందుకంటే ఏపీ పోలీసులు వారి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు అని రాసుకొచ్చారు. మంత్రి లోకేశ్ చేసిన ఈ సెటైరికల్ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Feel sorry for the guys relaxing in the fields. 😬 Can't help, because the @appolice100 drones do their job. https://t.co/Ndzmhqfvy1
— Lokesh Nara (@naralokesh) April 7, 2025












Click it and Unblock the Notifications