వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్‌తో నాకు పోలికా:లోకేష్, బాబుపై సొంత ఎంపీ ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు, తనకు పోలిక లేదని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ అన్నారు. కేటీఆర్ ఓ మంత్రిగా అమెరికాలో పర్యటించారని, తాను కేవలం కార్యకర్తగా మాత్రమే పర్యటించానని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లోని వ్యాపార అవకాశాల గురించి తాను వివరించేందుకు అమెరికాకు వెళ్లానని చెప్పారు. ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఓ మంత్రిగా వెళ్లిన కేటీఆర్ రెండు డీల్స్ కుదుర్చుకున్నారని, త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు తన పర్యటనలో ఎన్నో డీల్స్ కుదుర్చుకుంటాలన్నారు.

Nara Lokesh says there is no comparison between him and KTR

హైదరాబాద్ నగరం అన్ని రకాల వసతులు కలిగిన అద్భుత నగరమన్నారు. అమరావతికి అంతకుమించిన పేరు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. చంద్రబాబును విమర్శించే అర్హత ఎవరికీ లేదన్నారు. తాను తెరవెనుక ఉండి ఏదో చేస్తున్నాననే ప్రచారం అవాస్తవమన్నారు.

చంద్రబాబుపై శివప్రసాద్

తెలుగుదేశం పార్టీ ఎంపీ శివప్రసాద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

సీఎం సొంత జిల్లా చిత్తూరును పట్టించుకోవడం లేదన్నారు. సీట్లు తక్కువగా వచ్చాయని చిన్నచూపు చూస్తున్నారేమోనని అన్నారు. ఎన్నికల్లో సీట్లు ఎక్కువగా గెలుచుకున్న ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలపై అపార ప్రేమ చూపిస్తున్నారన్నారు.

English summary
Nara Lokesh says there is no comparison between him and KTR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X