అమరావతిలో స్పోర్ట్స్ అకాడమీ - లక్నో సూపర్ జైంట్స్ యాజమాన్యంతో లోకేష్ చర్చలు..!!

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల విస్తరణతో పాటు క్రీడారంగ అభివృద్ధికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది.ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయి వ్యాపార సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు,క్రీడాకారులకు మెరుగైన శిక్షణ సదుపాయాలు కల్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా RPSG గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శాశ్వత్ గోయెంకాతో మంత్రి నారా లోకేష్ సమావేశమై పలు కీలక ప్రతిపాదనలు చేశారు.

అమరావతిలో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ అకాడమీ

విశాఖపట్నంలో జరిగిన ఈ భేటీలో అమరావతిలో ప్రత్యేక స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి,వారికి శిక్షణతో పాటు అవసరమైన ప్రోత్సాహం అందించాలని సూచించారు.RPSG గ్రూప్‌కు చెందిన లక్నో,డర్బన్ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలతో అనుసంధానం చేస్తూ,ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడా ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశాలను వివరించారు.ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో స్థానిక జట్టును ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు.

nara-lokesh-seeks-rpsg-investment-in-sports-it-and-renewable-energy-at-visakhapatnams-cii-summit

పెట్టుబడులు,ఐటీ కార్యకలాపాల విస్తరణకు ఆహ్వానం

RPSG గ్రూప్‌కు చెందిన FSP డిజైన్ సంస్థ ద్వారా మంగళగిరిలో లగ్జరీ దుస్తులు,బ్రైడల్ కౌచర్ తయారీ,డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి ఆహ్వానించారు.అలాగే సోలార్,బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్,గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు.విశాఖపట్నం,తిరుపతిలో ఐటీ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు విజయవాడలోని ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ కార్యకలాపాలను మరింత పెంచాలని కోరారు.

సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు
సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు

రూ.3,286 కోట్లతో విండ్ పవర్ ప్రాజెక్ట్

ఈ సందర్భంగా శాశ్వత్ గోయెంకా మాట్లాడుతూ..విజయవాడలోని మేధా ఐటీ టవర్‌లో ఫస్ట్ సోర్స్ కార్యాలయం పనిచేస్తోందని తెలిపారు.ఏపీలో రూ.3,286 కోట్ల పెట్టుబడితో 349.8మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.2025లో విశాఖపట్నంలో జరిగిన CII భాగస్వామ్య సదస్సులో దీనికి సంబంధించి ఒప్పందం కుదిరిందని గుర్తుచేశారు.రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో స్పెన్సర్స్ రిటైల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని,ప్రభుత్వం చేసిన తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.

క్రీడలు,ఇంధనం,ఐటీ,తయారీ రంగాల్లో RPSG గ్రూప్ భాగస్వామ్యం పెరిగితే రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ప్రభుత్వ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక,క్రీడా రంగాల అభివృద్ధికి మరో ముందడుగు కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+