50 రోజులుగా బాధపడుతున్న లోకేష్ - అయినా ముందుకే..!!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. వంద రోజుల యాత్ర పూర్తి చేసుకున్న లోకేష్ ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగిస్తున్నారు. లోకేష్ ఇప్పటికే రెండు జిల్లాల్లో యాత్ర పూర్తి చేసారు. లోకేష్ భుజానికి గాయం అయింది. 50 రోజులుగా భుజానికి అయిన గాయం నొప్పితో బాధ పడుతున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుడి చేతి భుజానికి స్కానింగ్ చేయించారు. రిపోర్టు ఆధారంగా వైద్యం కొనసాగనుంది.
నారా లోకేష్ కుడి చేతి భుజానికి మళ్లీ తీవ్రమైన నొప్పి ప్రారంభమైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో కార్యకర్తల తోపులాట జరిగింది. ఈ సమయంలోనే సెల్ఫీ కోసం అభిమానులు ఆయన భుజాన్ని బలంగా లాగడంతో గాయమైంది. అప్పటి నుంచి నొప్పితో బాధపడుతూనే నారా లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఫిజియథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకున్నా నొప్పి తగ్గడం లేదు. నంద్యాల పద్మావతి నగర్‌లో ఉన్న మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్ లో లోకేష్ స్కానింగ్ చేయించారు.

ఫిజియథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రతలు తీసుకున్నా నొప్పి వేధిస్తోంది. పాదయాత్ర కారణంగా విశ్రాంతి లేక గాయం పైన ఒత్తిడి పెరుగుతున్నట్లు గుర్తించారు. భుజం నొప్పి కారణంగా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లుగా సమాచారం. లోకేష్ మాత్రం పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నెల మహానాడు కు లోకేష్ హాజరు కానున్నారు. పార్టీ ఎన్నికల ముందు నిర్వహిస్తున్న కీలకమైన నిర్ణయాల వేదికగా ఈ సారి మహానాడు నిలవనుంది. ఇప్పటికే రాజమండ్రిలో మహానాడు నిర్వహణకు నియమించిన కమిటీలు పనులు మొదలు పెట్టాయి.
నంద్యాల: నారా లోకేష్ కుడి భుజానికి స్కానింగ్..!!#NaraLokesh #YuvagalamPadayatra #TDP #Oneindiatelugu pic.twitter.com/j2fnd7UQM3
— oneindiatelugu (@oneindiatelugu) May 18, 2023












Click it and Unblock the Notifications