ఎపి, టి తేడా లేకుండా: లోకేష్, బాబు పోక-లోకేష్ రాక!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే తేడా లేకుండా తాము పార్టీ కార్యకర్తలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ గురువారం అన్నారు. తెలుగుదేశం పార్టీ సమన్వయకర్తగా లోకేష్ హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు.
చంద్రబాబు లేక్ వ్యూ అతిథి గృహంలో అడుగుపెట్టిన ముహూర్తంలోనే లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. నారా లోకేష్ తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రతి టిడిపి కార్యకర్తకు నూటికి నూరు శాతం సంక్షేమ నిధి ద్వారా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యకర్తలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎపి, టి అనే తేడా లేకుండా కార్యకర్తలను ఆదుకుంటామన్నారు.
చంద్రబాబు బాధ్యతలు స్వీకరించే సమయానికే ఆయన కుమారుడు నారా లోకేశ్.. పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో కార్యకర్తల సంక్షేమ నిధికి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ముందుగా ఈ ముహూర్తం బాబు కోసం ఎంపిక చేశారు. లోకేశ్‌కూ అదే బాగుందని పండితులు చెప్పడంతో ఆయనా అదే తన బాధ్యతల స్వీకారానికి అదే ముహూర్తాన్ని ఎంచుకొన్నారు.












Click it and Unblock the Notifications