పవన్ అంటే గౌరవమే, ఆరోపణలు నిరూపించండి, శ్రీరెడ్డి ధర్నా చేస్తే..: లోకేష్ సవాల్
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. పవన్ తనపై చేసిన అవినీతి ఆరోపణలకు, శ్రీరెడ్డి విషయంలో చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే చూపించాలని లోకేష్ సవాల్ విసిరారు.
పవన్ అంటే వ్యక్తిగతంగా తనకు ఎప్పుడూ గౌరవమేనని నారా లోకేష్ చెప్పారు. పవన్ చుట్టు కొందరు చేరి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి శ్రీరెడ్డి ధర్నా చేస్తే తనకేం సంబంధం అని లోకేష్ అన్నారు. తనకు సినీ పరిశ్రమపై అవగాహన లేదని చెప్పారు.

మంత్రి లోకేష్ అడ్డూ అదుపూ లేకుండా అవినీతికి పాల్పడుతున్నారని, ఆయన అవినీతిని చూసి తాత ఎన్టీఆర్ ఆత్మ కూడా క్షోభించి ఉంటుందని పవన్ కళ్యాణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉండగా, ఢిల్లీపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌లు మాట్లాడటం లేదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పులిలా పోరాడుతుంటే.. జగన్మోహన్ రెడ్డి పిల్లిలా గ్రామాల్లో తిరుగుతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications