పవర్ చూపిస్తారనుకుంటే..: పవన్ కళ్యాణ్‌పై లోకేష్ సెటైర్లు, ‘జగన్ దుప్పటి కప్పుకుని..’
కడప: కేంద్ర ప్రభుత్వంతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ మోసం చేసినా ఏపీని సీఎం చంద్రబాబు అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని చెప్పారు.

జగన్ దొంగ పుత్రుడు.. పవన్ దత్త పుత్రుడు
మంగళవారం ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట దీక్షలో లోకేష్ మాట్లాడుతూ.. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ దీక్ష చేపడితే.. ఆయనపై ఐటీ దాడులు చేయించారని ఆరోపించారు. బీజేపీకి జగన్ దొంగ పుత్రుడైతే.. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని మోడీపై వీరిద్దరూ ఒక్క విమర్శ కూడా చేయలేదని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ..
బీజేపీ అంటే భారతీయ జగన్, పవన్ కళ్యాణ్ పార్టీ అని లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ పార్టీ ఒక డ్రామా కంపెనీ అని విమర్శించారు. వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు, విశాఖలో జరిగిన కోడికత్తి దాడి ఇవన్నీ డ్రామాలే అని లోకేష్ అన్నారు.

ఆస్పత్రిలో జగన్ దుప్పటి కప్పుకుని..
విశాఖ విమానాశ్రయంలో నవ్వుకుంటూ వెళ్లిన జగన్.. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో నవ్వుకుంటూ, చేతులు ఊపుతూ వెళ్లారని లోకేష్ చెప్పారు. మూడు గంటలసేపు బాగానే ఉన్న జగన్.. ఆస్పత్రిలో దుప్పటి కప్పుకుని.. ఫొటోలు బయటికి పంపి డ్రామాకు తెరతీశారని లోకేష్ ఆరోపించారు.

పవర్ స్టార్ అనుకుంటే..
కవాతులు చేస్తున్న పవన్ కళ్యాణ్.. టిట్లీ తుఫాను బాధితులను పరామర్శించేందుకు ఆరు రోజుల తర్వాత వెళ్లారని లోకేష్ మండిపడ్డారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్‌గా కేంద్రాన్ని నిలదీస్తారనుకుంటే.. చివరకు సైలెంట్‌గా ఉండిపోయారని ఎద్దేవా చేశారు.

బాబును అందుకోలేకపోతున్నాం
పని విషయంలో సీఎం చంద్రబాబు స్పీడును అందుకోవడం ఎవరి వల్ల కావడం లేదని అన్నారు. ఏపీ భవిష్యత్ బాగుపడాలంటే మరోసారి చంద్రబాబును గెలిపించాలని మంత్రి లోకేష్ అన్నారు. టీడీపీకి మరోసారి ఘన విజయాన్ని కట్టబెట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు.
-
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!! -
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ












Click it and Unblock the Notifications