నా వల్ల కావడం లేదు: బాలయ్య గెటప్‌కు అల్లుడు లోకేష్ ఫిదా
హైదరాబాద్: గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో హీరో నందమూరి బాలకృష్ణ లుక్స్ అద్భుతంగా ఉన్నాయని అని ఆయన అల్లుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశంసించారు. దసరా సందర్భంగా ఈ సినిమాలో బాలకృష్ణ గెట్‌పను విడుదల చేసిన విషయం తెలిసిందే.
దానిపై లోకేశ్ తన ట్విట్టర్‌లో స్పందించారు. 'గౌతమిపుత్ర శాతకర్ణిలో ఆయనను చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకొంటున్నాయి. ఈ దృశ్యకావ్యం తెరపై ఆవిష్కృతమయ్యేవరకూ ఆగడం నా వల్ల కావడం లేదు' అని ఆయన అన్నారు.

కాగా, నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చూసిన బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియా కథానాయిక పాత్ర పోషిస్తోంది. అమరావతిని పరిపాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత కథ ఆధారంగా క్రిష్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.












Click it and Unblock the Notifications