శ్రీకాకుళం జిల్లాపై సత్య నాదెళ్ల వ్యాఖ్య: మురిసిన నారా లోకేష్
హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా.. టెక్నాలజీ పైన స్పందించారు. టెక్నాలజీని దరి చేర్చుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ముందంజలో ఉంటుందని చెప్పారు.
ఈ సందర్భంగా నారా లోకేష్... మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా మాట్లాడిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
భారత దేశంలో ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలతో పాటు మానవ వనరులూ ఉన్నాయని, ఈ దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టి అద్భుతమని సత్య నాదెళ్ల కితాబిచ్చారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా సరైన అజెండాతో ఆయన ముందుకు వెళ్తున్నారన్నారు.

సాంకేతికతతోనే అభివృద్ధి, ప్రజలకు సాధికారత సాధ్యమని చెప్పారు. భారత దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో శ్రీకాకుళం జిల్లాలో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి మైక్రోసాఫ్ట్ ఈ దిశగా చర్యలు తీసుకుందన్నారు.
పాఠశాలల్లో డ్రాపౌట్స్ వివరాలు తెలుసుకునేందుకు కూడా సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో 1970వ దశకంలో రేడియో ద్వారా మారుమూల పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పేవారని, కానీ నేడు పరిస్థితి మారిందని సత్య నాదెళ్ల అన్నారు.
గత జూన్ నెలలో కెన్యాలోని ఓ పాఠశాలను సందర్శించిన సమయంలో స్కైప్ టెక్నాలజీ ద్వారా భారత్‌లోని స్కూల్ నుంచి పాఠాలు చెప్తుండటం చూసి తాను ఆశ్చర్యపోయానని సత్య నాదెళ్ల చెప్పారు. దీనిని నారా లోకేష్ గుర్తు చేశారు.
-
యుద్ధంపై ప్రధాని మోదీ కీలక మీటింగ్.. సంచలన నిర్ణయాలు ఇవే.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications