సతీమణి భువనేశ్వరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు, లోకేష్ కూడా

హైదరాబాద్: సెప్టెంబర్ 10... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెళ్లి రోజు. చంద్రబాబు - నారా భువనేశ్వరిల పెళ్లి రోజు సందర్భంగా వారి తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ తన పేరెంట్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

'అమ్మా, నాన్నా హ్యాపీ యానివర్సరీ. ఇటువంటి వార్షికోత్సవాలను మీరు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇదే విధమైన ప్రేమ, ఆప్యాయతలను పరస్పరం చూపుతూ పర్‌ఫెక్ట్ కపుల్‌గా ఆదర్శంగా నిలవాల'ని లోకేశ్ పేర్కొన్నారు.

Nara Lokesh wishes to Chandrababu and Bhuvaneswari on Marriage anniversary

1981 సెప్టెంబర్10న నాటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడికు, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరికి చెన్నైలోని కళైవానర్ ఆరంగం ఆడిటోరియంలో వైభవంగా వివాహం జరిగింది.

చంద్రబాబు ట్వీట్

'ప్రజాపాలనలో తలమునకలై ఉండే నాకు అనునిత్యం తోడై ఉండి, కుటుంబానికి అన్నీ తానై నడిపించే నా సతీమణి నారా భువనేశ్వరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు' అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటోలో చంద్రబాబు, భువనేశ్వరి నవ్వుతూ ఉన్నారు. చంద్రబాబు ఒళ్లో మనవడు దేవాన్ష్ కూర్చున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+