'ప్రతినిధి' జోరు: గుద్దితే.. జగన్‌పై నారా రోహిత్(పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ సినీ హీరో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రోహిత్ సోమవారం చిత్తూరు జిల్లాలో టిడిపి తరఫున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా సొమ్ము తిన్నోడిని గుద్దితే.. పేదలు, రైతులకు రుణ, వడ్డీమాఫీలను చేయవచ్చని నారా రోహిత్ పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
సోమవారం రాత్రి తిరుపతిలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ముత్యాలరెడ్డిపల్లె, నాలుగుకాళ్ల మండపం, జీవకోన, రాజేంద్రనగర్ వద్ద ఏర్పాటు చేసిన సభల్లో ఆయన ప్రసంగించారు.

నారా రోహిత్
నీతివంతమైన పాలన తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నారా రోహిత్ చెప్పారు. తెలుగోడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసిందన్నారు.

నారా రోహిత్
సైకిల్‌ని గెలిపిస్తే.. అవినీతి నుంచి పుట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు జైలు వెళ్లడం ఖాయమని నారా రోహిత్ తన ప్రచారంలో వ్యాఖ్యానించారు.

నారా రోహిత్
తెలుగోడి ఆత్మగౌరవం దేశ, విదేశాల్లో వెలిగిపోవాలంటే పరిపాలనాదక్షుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు.

నారా రోహిత్
ప్రశాంత తిరుపతి నగరాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ ప్రచారంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణ పాల్గొన్నారు.

నారా రోహిత్
నారా రోహిత్ రోడ్ షో సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి గంగులయ్య, ఉంగరాల హరి, మాజీ వార్డు సభ్యులు రమేష్, నాగరత్నమ్మ తదితరులు తమ అనుచరులతో పాటు సైకిల్ ఎక్కారు.

నారా రోహిత్
కాగా, మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని నారా రోహిత్ దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

నారా రోహిత్
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను నారా రోహిత్‌కు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

నారా రోహిత్
తను చిత్రం ప్రతినిధి ప్రేక్షకాదరణ పొందుతున్నందున స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్టు చెప్పారు. గుంటూరు జిల్లాలో మే 2న టిడిపి తరపున ఎన్నికల ప్రచారం చేస్తానన్నారు. కాగా, నారా రోహిత్ నటించిన ప్రతినిధి సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

నారా రోహిత్
ప్రముఖ సినీ హీరో, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రోహిత్ సోమవారం చిత్తూరు జిల్లాలో టిడిపి తరఫున ప్రచారం నిర్వహించారు.












Click it and Unblock the Notifications