2090లో కూడా టిడిపి రాదు: హరీష్, జెపిపై నిప్పులు

హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 2019లో కాదు కదా... 2090లో కూడా అధికారంలోకి రాదని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ శాసన సభ్యుడు హరీష్ రావు సోమవారం అన్నారు. గజ్వెల్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, ఇటీవల ఆ పార్టీ నుండి పోటీ చేసిన నర్సా రెడ్డితో పాటు ఎంపీటిసీలు, జెడ్పీటీసీలు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. ఇక నుండి రోజు తెరాసలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. నర్సారెడ్డి చేరికతో గజ్వెల్లో కాంగ్రెస్ పూర్తిగా ఖాళీ అయిందన్నారు.

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెసు, టిడిపి ఖాళీ అయ్యే రోజులు ముందు ముందు ఉన్నాయన్నారు. గజ్వేల్ నుండే తెరాస ప్రభంజనం ప్రారంభమవుతుందన్నారు. గజ్వెల్‌ను ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తామన్నారు. కెసిఆర్‌కు ఎవరు సాటిలేరన్నారు. తెలంగాణ సాధించడంతో ఓ ఉద్యమం ముగిసిందని చెప్పారు. ఇప్పుడు అందరి సహకారంతో అభివృద్ధి అజెండాగా ముందుకు పోతామన్నారు.

 Narasa Reddy joins in TRS

ఎన్టీఆర్ ట్రస్ట్‌కు టులెట్ బోర్డ్ పెట్టక తప్పదన్నారు. లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ సెల్ఫ్ డిక్లెర్డ్ మేధావి అన్నారు. తమ పైన కేసులు ఉన్నాయని జెపి చెప్పడం విడ్డూరమన్నారు. తమ పైన ఉద్యమ కేసులు తప్ప ఎక్కడా దోపిడీ కేసులు లేవని చెప్పారు. తాము జెపిలా ఇంట్లో ఏసి కింద కూర్చొని రాజకీయాలు చేయడం లేదన్నారు.

కొట్టుకుపోతాం: రేణుక

తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ సీనియర్ నేత రేణుకా మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ ఓటమికి టీ కాంగ్రెస్ నేతలదే బాధ్యత అన్నారు. కుటుంబ సభ్యులకు సీట్లు కావాలని కోరారే తప్ప, పార్టీ గెలుపు కోసం పని చేయలేదన్నారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పదవుల నుంచి సోనియా, రాహుల్ గాంధీ తప్పుకోవాలన్న వాదనను రేణుకా చౌదరి తీవ్రంగా విబేధించారు.

ఈ రోజున పార్టీకి ఈ పరిణామాలు వచ్చాయంటే అది తామే ఆత్మపరిశీలన చేసుకోవాలసిన సమయమన్నారు. ఇప్పటికైన వ్యక్తిగత విబేధాలను తొలగించి, అందరూ కలిసి పనిచేస్తే విజయం సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు.

సోనియా ఎన్ని తీవ్ర పరిణామాలు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చారని, అందుకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు అందరూ గమనించారని అనుకుంటున్నానన్నారు. ప్రచారం విషయంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లలేకపోయామని చెప్పారు. ఓటమిని ఎదుటి వాళ్ల మీదకు నెట్టకుండా నిజాయితీగా, ధైర్యంగా ముందుకు వచ్చి తమదే బాధ్యతని నేతలు ఒప్పుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+