తేడా తెల్సుకో: గడ్డంపై పవన్ కళ్యాణ్‌కు నారాయణ క్లాస్

చేగువేరా గడ్డానికి, మోడీ గడ్డానికి తేడాను పవన్ తెలుసుకోవాలని సూచించారు. చేగువేరా గడ్డం సమాజాన్ని మార్చేదయితే, మోడీ గడ్డం దేశాన్ని ధ్వంసం చేసేదన్నారు. అయినా, పవన్ కల్యాణ్ రాజకీయాలేంటో, ఆయన ఏం చెబుతున్నారో తనకు అర్థం కావడం లేదని నారాయణ ఎద్దేవా చేశారు.
అవాస్తవం: రాములు
తెలుగుదేశం పార్టీని వీడుతున్నానంటూ తనకు వ్యతిరేకంగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే పి రాములు అన్నారు. బడుగు, బలహీన వర్గాలవారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
కాగా, ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం ప్రచార కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర బిసి సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నియామకం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా పార్టీ బిసి నేత ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎర్రబెల్లి దయాకర్ రావు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా రావుల చంద్రశేఖర రావు పేర్లను ప్రకటించే అవకాశముంది.












Click it and Unblock the Notifications