నారాయణ ఐ ఐ టీ లో ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య
తిరుపతి: తిరుపతి న్యూబాలాజీ కాలనీలోని నారాయణ ఐ.ఐ.టీ కళాశాల విద్యార్థి హర్ష హాస్టల్ రూంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయాడు. మృతుడు హర్ష చిత్తూరుజిల్లా వి.కోటకు చెందిన వాడు. 5 రోజుల క్రితం హర్ష స్వగ్రామానికి వెల్లి మంగళవారం మద్యాహ్నం కళాశాలకు తిరిగి వచ్చాడు.
Recommended Video

Narayana College Principal Audio Tape Leaked 'ఆడియో టేపు' లీక్ | Oneindia Telugu
తోటి స్నేహితులు క్లాసుకు రమ్మన్నా హర్షా వెళ్ళకుండా తన రూంకు చేరుకొని గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని మృతిచెందాడు. మృతికి గల కారణాలు తెలియాల్సింది వుంది. విద్యార్ధి బై.పీ.సీ ద్వితీయ సంవత్సరం చదువు తున్నాడు.

హర్ష పిరికి వాడు కాదని చదువులోనూ ముందుంటాడని ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడు తెలియటం లేదని బంధువులు చెబుతున్నారు. సంబంధిత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హర్ష తల్లిదండ్రులకు అతని స్నేహితులు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.












Click it and Unblock the Notifications