వ్యభిచార కొంపలకున్న పాలసీలైనా.. బూతులు మాట్లాడే రోజాను.. : నారాయణ వివాదాస్పద వ్యాఖ్య

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ శాసనసభపై సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. వ్యభిచార కొంపలకున్నటువంటి పాలసీలైనా అసెంబ్లీకి ఉన్నాయా లేవా? అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నిజాయితీపరులైన అధికారులను శిక్షిస్తూ రౌడీ శాసనసభ్యులకు ముఖ్యమంత్రి కాపుగాస్తున్నారని ఆరోపించారు. బూతు మాటలు మాట్లాడే రోజా లాంటి వారిని అసెంబ్లీకి ఎన్నుకోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. అదే సమయంలో రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేయడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

Narayana makes controversial comment on assembly

బాక్సైట్‌పై గిరిజనుల్లో చీలిక తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 99 ఏళ్లు లీజుకు ఇవ్వడమంటే కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడమే అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చండీయాగం పేరుతో నెయ్యిని వృధా చేస్తున్నారన్నారు. తెలంగాణ కోసం యాగం చేస్తే వెయ్యి మంది బతికేవారని నారాయణ వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+