చంద్రబాబు క్యాబినెట్లో నారాయణ విద్యాసంస్థల అధినేత?

ప్రస్తుతం నారాయణ ఎమ్మెల్యేగా గానీ ఎమ్మెల్సీగా గానీ లేరు. కానీ, గత 15 ఏళ్లుగా ఆయన తెలుగుదేసం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి విశ్వాసపాత్రునిగా ఉన్నారు. ఆయనను నేరుగా మంత్రి పదవిలోకి తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కిశోర్ బాబు గతంలో ఐఆర్ఎస్ అధికారి. పూర్వాశ్రమంలో బాలయోగి, నితీశ్ కుమార్ వద్ద పని చేశారు. ఆయనకున్న అనుభవం వల్ల తొలిసారి అయినా మంత్రి పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎస్టీ వర్గాల నుంచి తెలుగుదేశం పార్టీలో ముడియం శ్రీనివాస్ ఒక్కరే పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నుంచి గెలిచారు. ఎస్టీ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనుకొంటే మొదటిసారి అయినా ఆయనకు అవకాశం దక్కే వీలుంది. అవకాశం ఉంటే బీసీల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా మంత్రి పదవి ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారు.
ఆ సామాజిక వర్గం నుంచి ఈసారి విశాఖ జిల్లాలో పల్లా శ్రీనివాస యాదవ్, చిత్తూరు జిల్లా నుంచి శంకర యాదవ్ గెలిచారు. ఇద్దరూ మొదటిసారి ఎమ్మెల్యేలే. మొదటిసారి అయినా ఈ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ తగలవచ్చని అంటున్నారు.












Click it and Unblock the Notifications