బాబుకు మాల్యా గతి: నారాయణ, కేసీఆర్‌కు భయమని కిషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నిత్యం విమానాల్లో చక్కర్లు కొడుతున్నారని, ఇలాగే ఉంటే, ఆయన పరిస్థితి కూడా కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాలా తయారవుతుందని ఎద్దేవా చేశారు.
తిరుపతి అంత కూడా లేని సింగపూర్‌కు చంద్రబాబు తరుచూగా ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ పాలన పరమానందయ్య శిష్యుల కథలా ఉందని చురకలు అంటించారు. రుణమాఫీ చేసి చెట్టుకింద పాలించినా ఫరవాలేదన్నారు.

తెరాసపై కిషన్ రెడ్డి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వేరుగా మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణ పైన హైకోర్టు ఆదేశాలతో కూడా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు.
రాష్ట్ర విభజనకు ముందు హైకోర్టు ఆదేశాలతోనే నాటి కిరణ్ కుమార్ సర్కారు కేవలం నెల వ్యవధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తును పూర్తి చేసిందన్నారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల వెళ్లాలంటేనే తెరాస భయపడుతోందన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications