జగన్‌తో పొత్తుపై డొంక తిరుగుడు: సిపిఎంపై నారాయణ

"మీరు రాసిన లేఖలో 'దిగజారి' అనే మాట వాడారు. అయితే, మీ దిగజారుడు రాజకీయం ముందు నేనెం త?'' అని నారాయణ వ్యాఖ్యానించారు. రాజకీయ అంశాలపై సూటిగా సమాధానం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. డొంక తిరుగుడు సమాధానానికే సమయమంతా తిన్నారన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో సీట్ల సర్దుబాటు విషయమై మాట్లాడిన ప్పుడు అలాంటి చర్చలు జరగలేదంటే సరిపోయేదని ఆయన అన్నారు. అయితే బహిరంగ రహస్యాన్ని తాను సూటిగా ప్రస్తావించడాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అడిగారు.
జగన్‌తో పొత్తు వ్యవహారంపై ఆధారాలు, రుజువులు అంటున్నారని, కానీ, ఇది కోర్టులో వాదన కాదని నారాయణ తిప్పికొట్టారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో సిపిఎం పొత్తు పెట్టుకుంటుందనేది రాజకీయ పార్టీల అభిప్రాయమని, దీనిపై తమ పార్టీ అభిప్రాయం కూడా చెప్పామని వివరించారు.
దానిపై భవిష్యత్తులో నిజానిజాలు తేలుతాయని, అప్పుడు ఎవరు అబద్ధం ఆడారో, ఎవరు నిజాయితీతో ఉన్నారో తెలుస్తుందని చెప్పారు. తనకు నోటీ దురుసు అని రాఘవులు చేసిన వ్యాఖ్యపై కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications