అడ్డంగా దొరికేసిన హేమ - డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ..!!
నటి హేమ అడ్డంగా దొరికేసారు. సంచలనంగా మారిన బెంగళూరు రేవ్ పార్టీలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పార్టీలో తొలుత తాను అసలు లేనంటూ హేమ వీడియో విడుదల చేసారు. దీనికి బిన్నంగా హేమ పార్టీలో ఉన్నారంటూ బెంగళూరు పోలీసులు ఆధారాలు విడుదల చేసారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారనే ప్రచారం ఉంది. పలువురి నుంచి నార్కోటిక్స్ శాంపిల్స్ సేకరించి..పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయింది.
రేవ్ పార్టీలో బిగ్ టర్న్
బెంగళూరు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నార్కోటిక్స్ బృందం గుర్తించింది. అందులో నటి హేమ కూడా ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ మేరకు నార్కోటిక్ టీమ్ రిపోర్ట్ సమర్పించింది. ఆ రోజు రేవ్ పార్టీలో పాల్గొన్న 150 మంది బ్లడ్ శాంపిల్స్ నార్కోటిక్ టీమ్ సేకరించింది. ఇందులో 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 86 మందికి ఈ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.

డ్రగ్స్ తీసుకున్న హేమ
అయితే హేమతో పాటు వీరందరినీ బాధితులుగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందిని చెబుతున్నారు. ఈ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నా ఇప్పటికీ ఆమె బుకాయిస్తూనే ఉంది. రేవ్ పార్టీకి తనకి ఎలాంటి సంబంధం లేదని.. అసలు అందులో ఎవరున్నారో కూడా తనకి తెలియదని హేమ మొదటిగా స్పందించింది. తాను హైదరాబాద్‌లోనే రెండు రోజులుగా ఉన్నానని.. ఇక్కడే ఓ ఫామ్ హోస్‌లో చిల్ అవుతున్నట్లుగా ఓ వీడియోను రిలీజ్ చేసింది. అయితే దీనిని కర్ణాటక పోలీసులు ఖండించారు. రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారంటూ ఫొటోను కూడా రిలీజ్ చేశారు.
నిర్దారించిన నార్కోటిక్స్
పోలీసులు రిలీజ్ చేసిన ఫొటోలో, హేమ చేసిన వీడియోలో ఒకటే డ్రెస్‌లో ఉండటంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఈ కేసును బెంగళూరు పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నార్కోటిక్స్ టీం పార్టీ జరిగిన ప్రాంతంలో అన్ని ఆధారాలు సేకరించింది. పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు నిర్ధారించారు. పలువురు ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు. పార్టీలో డ్రగ్స్ వినియోగం పైన శాంపిల్స్ సేకరించిన నార్కోటిక్స్ ..ఆ తరువాత నివేదికలను బయట పెట్టింది. అందులో ఇప్పుడు హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications